భారతదేశంలో చిన్న మొత్తాల పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అంటే ఓ నమ్మకం. చాలా మంది గ్రామీణులు దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ వరకూ అందరికీ ఎల్ఐసీ పాలసీలు ఉండడం పరిపాటిగా మారింది. పెట్టుబడికి నమ్మకమైన రాబడితో పాటు బీమా కవరేజి ఉండడంతో ఎక్కువ మంది ఎల్ఐసీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఎల్ఐసీ సేవలను పొందడానికి మాత్రం సమీప బ్రాంచ్లకు వెళ్లి గంటల తరబడి లైన్లో నుంచోవాల్సి వస్తుందని చాలా మంది పాలసీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాలసీదారులకు మెరుగైన సేవలను అందించేందుకు తాజాగా ఎల్ఐసీ వాట్సాప్ ద్వారానే 11 రకాల ఎల్ఐసీ సేవలను పొందేందుకు అవకాశం ఇచ్చింది. పాలసీ హోల్డర్లు ఇప్పుడు రుణ అర్హత, రీపేమెంట్ అంచనాలు, పాలసీ స్థితి, బోనస్ వివరాలు, యూనిట్ల స్టేట్మెంట్, ఎల్ఐసీ సేవలకు లింక్లు, ప్రీమియం బకాయి తేదీల అప్డేట్లు, రుణ వడ్డీతో సహా 11కి పైగా సేవలకు ప్రత్యక్ష సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఆ వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఎల్ఐసీ పాలసీదారుల కోసం తొలిసారిగా వాట్సాప్ సేవలను అందించింది. ఎల్ఐసీ పోర్టల్లో తమ పాలసీలను నమోదు చేసుకున్న వాట్సాప్లో ఎల్ఐసీ పాలసీదారులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హాయ్ అయిన అని టైప్ చేసి 89768 62090కి పంపితే ఎల్ఐసీ పాలసీదారులు ప్రీమియం వివరాలు, యూలిప్ ప్లాన్ స్టేట్మెంట్ల వంటి వివిధ ప్రయోజనాల కోసం వాట్సాప్ సేవలను ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం