బడ్జెట్ ధరలో కొత్త 5G ఫోన్! ఇంత తక్కువ ప్రైజ్‌కి ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే

Lava Bold 2 5G, ఒక కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్, భారతదేశంలో ₹12,999 ధరకు విడుదలైంది. ఇది 6.67" 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరా, MediaTek Dimensity 7060 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

బడ్జెట్ ధరలో కొత్త 5G ఫోన్! ఇంత తక్కువ ప్రైజ్‌కి ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే
Lava Bold 2 5g

Updated on: Mar 15, 2026 | 5:45 AM

భారతీయ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ Lava Bold 2 5Gను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన Bold 5G మోడల్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించబడింది. 6.67 అంగుళాల ఫుల్‌ HD+ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 7.55 మిల్లీమీటర్ల మందంతో సన్నగా ఉండి, ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో ఆధునిక లుక్ ఇస్తుంది. ఫీచర్‌ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరా ఉంది. తక్కువ కాంతిలో కూడా మంచి ఫోటోలు తీసేలా రూపొందించారు. ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పంచ్-హోల్ డిజైన్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌కు శక్తినిచ్చేది MediaTek Dimensity 7060 ప్రాసెసర్. ఇది 2.6GHz వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. కంపెనీ ప్రకారం దీనికి AnTuTu స్కోరు 5 లక్షలకుపైగా ఉంటుంది. ఫోన్‌లో 6GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్ అందించారు. ఇది Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.

ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. Lava Bold 2 5G 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ మార్చి 19 నుంచి అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ వినియోగదారులకు ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్ కూడా అందిస్తోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us