మన దేశంలో మంచి లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి వచ్చే ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. చవకైన స్మార్ట్ ఫోన్లుగా ఈ బ్రాండ్ కు పేరుంది. తక్కువ ధరలోనే అత్యుత్తమ ఫీచర్లను అందించే ఈ లావా కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మన దేశీయ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే వచ్చింది. లావా బ్లేజ్ 2 ప్రో పేరు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రెష్ డిజైన్ తో అదరగొడుతోంది. హెడ్ డిస్ ప్లేతో పాటు అత్యాధునిక ప్రాసెసర్ , అధిక ర్యామ్ సైజ్ తో మంచి పనితీరు అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని కూడా రూ. 10వేల లోపే ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో లావా బ్లేజ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే తో వస్తోంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ముందు వైపు స్క్రీన్ కి మధ్యలో హోల్ పంచ్ కట్ అవుట్ ఉంటుంది. 2.5డీ కర్వెడ్ స్క్రీన్ ఉంటుంది. ఈ లావా ఫోన్ ఆక్టా కోర్ యూనిసోక్ టీ616, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. వినియోగదారులకు మంచి వేగవంతమైన పనితీరుని అందిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మరో 8జీబీ వరకూ ఎక్స్ పాండబుల్ మెమరీ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకమైన మెమరీ కార్డు స్లాట్ ఉంటుంది.
ఈ లావా బ్లేజ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరా సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ ఉంటుంది. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. టైప్-సీ కేబుల్ ఆధారంగా పనిచేస్తుంది.
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ థండర్ బ్లాక్, స్వాగ్ బ్లూ, కూల్ గ్రీన్ వేరియంట్లలో అందుబాటులో ఉంంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ దర రూ. 9,999గా ఉంది. అన్ని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ పారంలలో ఇది అందుబాటులో ఉంటుంది. రూ. 10వేల లోపు బడ్జెట్లో మంచి పనితీరుతో పాలు ఫీచర్లు కావాలనుకొనే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..