గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్‌లు వద్దు.. సరికొత్త ఈ ప్లాస్మా స్టవ్‌ మీ ఇంట్లో ఉంటే వంటకు డోకా లేనట్టే

మనం రోజూ వాడే ఎల్పిజి గ్యాస్ అవసరం లేకుండా, కేవలం విద్యుత్తుతోనే నిజమైన మంటను సృష్టించే సరికొత్త టెక్నాలజీ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. అవును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల ఈ ఆవిష్కరణను హైలైట్ చేశారు.పెరుగుతున్న గ్యాస్ ధరల నుండి ఉపశమనం పొందేందుకు ఇది ఒక చక్కని ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు. ఇంతకూ ఈ ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ అంటే ఏమిటి?ఇంతకూ ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం పదండి.

గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్‌లు వద్దు.. సరికొత్త ఈ ప్లాస్మా స్టవ్‌ మీ ఇంట్లో ఉంటే వంటకు డోకా లేనట్టే
Plasma Electric Stove

Updated on: Apr 12, 2026 | 3:18 PM

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పడ్డ గ్యాస్ కొరతలతో దేశ వ్యాప్తంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఓ సరికొత్త ఆవిష్కరణ ప్రజలను బాగా ఆకర్షిస్తోంది. అదే ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ ఇటీవలే కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి దీనికి గురించి చెప్పుకొచ్చారు. ఇది సేమ్ మన ఎలక్ట్రిక్ స్టవ్‌ లాంటిదే.. అయితే ఇది గ్యాస్ అవసరం లేకుండానే మంటను సృష్టిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ స్టవ్ ఎల్‌పిజిలా కనిపించే, అదే అనుభూతిని ఇచ్చే మంటను ఇస్తుంది.

ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ అంటే ఏమిటి?

ఇది LPG లేదా PNG గ్యాస్‌ అవసరం లేకుండా మంటను సృష్టించే ఎలక్ట్రిక్ స్టవ్. ఇండక్షన్ స్టవ్‌లకు భిన్నంగా, ఇది ప్లాస్మా ఆర్క్ టెక్నాలజీని ఉపయోగించి మంటను క్రియేట్ చేస్తుంది. గాలిని అయనీకరణం చేయడం ద్వారా ఇది అత్యంత వేడినిచ్చే మంటను సృష్టిస్తుంది. దీనికి సిలిండర్లతో పనిలేదు, అలాగే దీని నుంచి పొగ కూడా రాదు. కేవలం విద్యుత్తు ద్వారానే ఇది శక్తివంతమైన మంటను సృష్టిస్తుంది.

ఇది ఎలా పని చేస్తుంది?

విద్యుత్తును ఉపయోగించి గాలిలోని అణువులను వేరు చేయడం ద్వారా ఇది మంటను సృష్టిస్తుంది. ఇది 1200°C నుండి 1300°C వరకు వేడిని ఉత్పత్తి చేస్తుంది. అచ్చం గ్యాస్ స్టవ్ లాగే వెలిగించగానే మంట వస్తుంది. ఇండక్షన్ లాగా వేడి అయ్యేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం ఎండదు. దీనినై వంట చేస్తే సేమ్ గ్యాస్ మీద వంట చేసిన అనుభూతే కలుగుతుంది.

ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ ఫీచర్లు

ఇది స్టీల్, అల్యూమినియం, ఇనుము, ఇత్తడి ఇలా అన్ని పాత్రలను ఈ స్టవ్‌పై మీరు వాడుకోవచ్చు. గ్లాస్ టాప్, మెటల్ అల్లాయ్ బర్నర్లతో చూడ్డానికి కూడా ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందలో ఆటోమేటిక్ షట్-ఆఫ్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీనిలో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏమిటంటే గ్యాస్ లీకవుతుందనే భయం అస్సలు ఉండదు. అలాగే మిగతా గ్యాస్ స్టవ్‌లలా ఇది మసి పట్టదు, కాబట్టి పాత్రలు, స్టవ్ నీట్‌గా ఉంటాయి.

ధర, స్పెసిఫికేషన్లు

ఇక ఈ ప్లాస్మా స్టవ్ ధర విషయానికి వస్తే ఇది మార్కెట్‌లో 2500W నుండి 6000W వరకు అందుబాటులో ఉంది. మోడల్‌ను బట్టి దీని ధర మార్కెట్‌లోఒ సుమారు 35,000 వరకు ఉంటుంది. సింగిల్, డబుల్ బర్నర్ రెండు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. కాస్తా రేట్‌ ఎక్కువైనా పర్లేదు గ్యాస్ టెన్షన్ లేకుండా అదే అనుభూతిని పొందాలి అనుకుంటే ఈ స్టవ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ దీనికి ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటే గ్యాస్ లా దీన్ని కరెంట్ లేని సమయంలో వాడడం కష్టం.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us