mAadhaar: అసలేంటీ ఎం ఆధార్‌.? ఈ యాప్‌తో ఉపయోగాలు ఏంటి.?

|

Jan 06, 2024 | 12:28 PM

యూజర్లు నేరుగా ఆధార్‌ను యాక్సెస్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఎం ఆధార్‌ పేరుతో ఓ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ యాప్‌ ఉపయోగం ఏంటి.? ఇందులో ఆధార్‌ కార్డ్‌ను ఎలా ఎంటర్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

mAadhaar: అసలేంటీ ఎం ఆధార్‌.? ఈ యాప్‌తో ఉపయోగాలు ఏంటి.?
Maadhaar App
Follow us on

ప్రస్తుతం ఆధార్‌ కార్డు ఉపయోగం అనివార్యంగా మారింది. సిమ్‌ కార్డ్‌ మొదలు సంక్షేమ పథకాల దరఖాస్తు వరకు ప్రతీ ఒక్క దానికి ఆధార్‌ కార్డ్‌ తప్పినసరిగా మారింది. దీంతో ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ కార్డును తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఆధార్ అవసరం పెరుగుతున్నా కొద్దీ యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

ముఖ్యంగా యూజర్లు నేరుగా ఆధార్‌ను యాక్సెస్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఎం ఆధార్‌ పేరుతో ఓ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ యాప్‌ ఉపయోగం ఏంటి.? ఇందులో ఆధార్‌ కార్డ్‌ను ఎలా ఎంటర్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఎంఆధార్‌లో ఇలా రిజిస్ట్రేషన్‌ ఇలా..

* ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి ఎంఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్‌ చేశాక.. ‘రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను క్లిక్ చేయాలి.

* అనంతరం ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్ చేసుకోవడానికి నాలుగు డిజిట్ల పిన్‌‌‌‌‌‌‌‌ లేదా పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం ముందుగా ఆధార్ నెంబర్ వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం కాప్చా కోడ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌ చేస్తే… రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ వెళ్తుంది.

* మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వచ్చిన వెంటనే ఆటో ఫిల్‌ అవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే సంబంధిత యూజర్‌కు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై డిస్‌‌‌‌‌‌‌‌ప్లే అవుతాయి.

* మెనూలో కింద కనిపించే ‘మై ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ట్యాబ్‌ను క్లిక్ చేసి పిన్‌‌‌‌‌‌‌‌ లేదా పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. డ్యాష్‌‌‌‌‌‌‌‌ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన సేవలను వినియోగించుకోవచ్చు.

ఈ యాప్ ఉపయోగాలు ఏంటంటే..

* మీ ఆధార్‌ కార్డ్ వివరాలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో చూసుకోవచ్చు. ఒకే ఫోన్‌లో ఐదుగురు ఫ్యామిలీ మెంబర్ల ఆధార్‌ వివరాలను స్టోర్ చేసుకోవచ్చు.

* ఆధార్‌ కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేట్ చేసుకోవచ్చు.

* వర్చువల్‌ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్‌ కార్డును నేరుగా ఫోన్‌లోనే లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవచ్చు. బయోమెట్రిక్‌ లాక్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు బ్యాంక్, ఆధార్‌ లింక్‌ వంటి మరెన్నో ఫీచర్లు పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..