Mask with a Mic Speaker: ఆకట్టుకుంటున్న బీటెక్ విద్యార్థి మాస్క్.. స్పీకర్‌తో డ‌బుల్ మాస్క్ అవిష్కరణ

|

May 24, 2021 | 8:24 AM

ప్రపంచాన్ని కుదేపేస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకునేందుకు రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వైద్యప‌ర‌మైన నూత‌న ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.

Mask with a Mic Speaker: ఆకట్టుకుంటున్న బీటెక్ విద్యార్థి మాస్క్.. స్పీకర్‌తో డ‌బుల్ మాస్క్ అవిష్కరణ
A Mask With A Mic Speaker
Follow us on

Mask with a Mic Speaker: ప్రపంచాన్ని కుదేపేస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకునేందుకు రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వైద్యప‌ర‌మైన నూత‌న ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. దీంతో క‌రోనాతో పోరాడేందుకు మరింత సుల‌భ‌త‌ర‌మ‌వుతోంది. తాజాగా కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి కెవిన్ జాకబ్ మ‌రో నూత‌న ప‌రిక‌రాన్ని ఆవిష్కరించాడు. కరోనా వైరస్ మహమ్మారి మధ్య సంభాషణల‌ను సులభతరం చేయడానికి మైక్, స్పీకర్‌తో కూడిన మాస్క్‌ను రూపొందించాడు.

కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించడం తప్పనిసరి. ఇదే క్రమంలో వ్యక్తుల మధ్య సంభాషణను సులువు చేసేందుకు బీటెక్ విద్యార్థి జాకబ్ వెరైటీ మాస్క్‌ను తయారు చేశాడు. ఈ మాస్క్‌ ద్వారా వైద్యులు… బాధితుల‌తో సుల‌భంగా మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత త‌రుణంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది డబుల్ మాస్క్‌లతో పాటు పీపీఈ కిట్‌లను ధరిస్తున్నారు. ఫ‌లితంగా బాధితుల‌తో సరిగా కమ్యూనికేట్ చేయలేక‌పోతున్నారు. అయితే కేర‌ళ‌కు చెందిన యువ‌కుడు తయారు చేసిన ఈ నూత‌న ఆవిష్కరణ… బాధితుల‌తో వైద్యులు సరిగా సంభాషించేందుకు వీలు కల్పిస్తుంది.


కెవిన్ జాక‌బ్‌ తల్లిదండ్రులు వృత్తిరీత్యా వైద్యులు. వీరు బాధితుల‌తో సంభాషించేట‌ప్పుడు స‌మ‌స్యలు ఎదుర్కొన‌డాన్ని జాక‌బ్ గ‌మ‌నించాడు. దీనికి ప‌రిష్కారంగానే ఈ స్పీక‌ర్ మాస్క్ త‌యారు చేశాడు. దీంతో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు స్పష్టంగా వినిపిస్తాయని జాకబ్ చెబుతున్నాడు. చిన్నవయసులో అద్భత ప్రయోగాలు శ్రీకారం చుడుతున్న జాకబ్‌ను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

Read Also…  Corona in Children: పిల్లలపై కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం.. వైరస్‌ ఉత్పరివర్తనాలను బట్టే.. ఆందోళన అవసరంలేదుః ఐఏపీ