Jio Anniversary Offers: మతిపోగుడుతున్న జియో వార్షికోత్సవ ఆఫర్లు.. అదనపు డేటాతో పాటు మరెన్నో ప్రయోజనాలు

|

Sep 06, 2023 | 5:30 PM

పెరిగిన పోటీ కారణంగా జియో కూడా వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా జియో ఏడో వార్షికోత్సవం పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. జియో ప్రకటించిన ఈ నయా ప్లాన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం

Jio Anniversary Offers: మతిపోగుడుతున్న జియో వార్షికోత్సవ ఆఫర్లు.. అదనపు డేటాతో పాటు మరెన్నో ప్రయోజనాలు
Jio network
Follow us on

భారతదేశంలోని టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకు నెట్‌ వచ్చిందంటే కారణం జియో అనే అందరికీ తెలిసిన విషయమే. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరకు వినియోగదారులకు నెట్‌ అందిస్తున్నాయి. పెరిగిన పోటీ కారణంగా జియో కూడా వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా జియో ఏడో వార్షికోత్సవం పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. జియో ప్రకటించిన ఈ నయా ప్లాన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

స్పెషల్‌ ఆఫర్లు ఇలా

  • జియో ఏడో వార్షికోత్సవం సందర్భంగా రూ.299 నుంచి రూ.2999 ప్లాన్‌లపై చెల్లుబాటు అవుతాయి.
  • రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ మొబైల్ డేటా, అపరిమిత
    వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల చెల్లుబాటుతో 7 జీబీ అదనపు డేటా యొక్క అదనపు ప్రయోజనంతో అందిస్తుంది.
  • రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ పైన పేర్కొన్న ప్రయోజనాలను 90 రోజుల చెల్లుబాటుతో పాటు 14 జీబీ అదనపు డేటాతో పాటు అందిస్తుంది.
  • రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 జీబీ మొబైల్ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. 

స్పెషల్‌ వోచర్లు

ఈ ప్లాన్‌లోని ప్రత్యేక ప్రయోజనాలలో 21 GB అదనపు మొబైల్ డేటా ఏజియోపై రూ. 200 తగ్గింపు, నెట్‌మెడ్స్‌పై 20 శాతం తగ్గింపు (రూ.800 వరకు) ఉన్నాయి. ఇందులో స్విగ్గిపై రూ. 100 తగ్గింపు, రూ. 149 అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఉచిత మెక్‌డొనాల్డ్ భోజనం, రిలయన్స్ డిజిటల్‌పై 10 శాతం తగ్గింపు కూడా ఉన్నాయి. విమానాలపై రూ. 1500 వరకు, హోటళ్లపై 15 శాతం తగ్గింపు. కూడా రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌ రీచార్జ్‌ చేసుకుంటే ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ యాత్ర డాట్‌ కామ్‌ ద్వారా రూ.4000 వరకూ తగ్గింపు లభిస్తుంది. రీఛార్జ్ చేసిన వెంటనే అర్హత కలిగిన కస్టమర్లకు మైజియో ఖాతాలో అదనపు ప్రయోజనాలు క్రెడిట్ అవుతాయని కంపెనీ తెలిపింది. మై జియో యాప్‌లో అదనపు డేటా డేటా వోచర్‌గా క్రెడిట్ అవుతుంది. అంటే వినియోగదారులు యాప్ నుంచి వోచర్‌ను రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..