
ఎక్స్-షోరూమ్ ధర రూ. 36.05 లక్షలుగా నిర్ణయించిన ‘జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్’, టాప్-స్పెక్ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ ఆధారంగా రూపుదిద్దుకుంది. 52 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే ప్రత్యేక AI వాయిస్ అసిస్టెంట్, ఐదు ఆకర్షణీయమైన రంగులతో వస్తున్న ఈ జీప్ మెరిడియన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!
జీప్ బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లాంచ్ చేసిన ఈ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్‌లో సాధారణ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు.
ఈ స్పెషల్ ఎడిషన్ SUV పెర్ల్ వైట్, టెక్నో మెటాలిక్ గ్రీన్, వెల్వెట్ రెడ్, గ్రిజియో మాగ్నీషియో, బ్రిలియంట్ బ్లాక్ అనే ఐదు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ ఎడిషన్‌లో జీప్ సంస్థ సరికొత్త ‘CARA AI వాయిస్ అసిస్టెంట్’ను పరిచయం చేసింది. స్టెల్లాంటిస్ అభివృద్ధి చేసిన ఈ అసిస్టెంట్ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. దీని ముఖ్య విశేషాలు ఏంటంటే..
ఈ జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్‌ను కంపెనీ టాప్-స్పెక్ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ ఆధారంగా తయారు చేసింది. అయితే దీని ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 170 hp పవర్‌ను, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఐచ్ఛిక 4×4 డ్రైవ్ సిస్టమ్ జతచేయబడ్డాయి. ఈ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 36.05 లక్షలుగా ఉంది.
ఇది సాధారణ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్‌తో పోలిస్తే కేవలం రూ. 44,000 మాత్రమే ఎక్కువ. ప్రత్యేక డిజైన్, AI అసిస్టెంట్, లిమిటెడ్ హోదా కారణంగా ఈ ధర తగినట్లుగానే ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అందువల్ల జీప్ అభిమానులకు, లిమిటెడ్ ఎడిషన్ వాహనాలను ఇష్టపడే కొనుగోలుదారులకు ఈ జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ రోడ్డుపై ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం!