ISRO: ఇస్రో నుంచి పంపిన ఉపగ్రహం చేసే పని ఏంటి? ప్రయోజనాలేంటో తెలిస్తే షాకే..

|

Aug 17, 2024 | 1:16 PM

ఇస్రో (ISRO -భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) మరోసారి ప్రయోగాన్ని విజయవంతం చూసింది. ఆగస్టు 16న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి3 రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. SSLV-D3 రాకెట్‌లోని EOS-8 ఉపగ్రహం కొత్త, భవిష్యత్తు సాంకేతికతలతో నిండి ఉందని.. ఇది ఇస్రో, భారతదేశ ప్రజల కలలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు..

ISRO: ఇస్రో నుంచి పంపిన ఉపగ్రహం చేసే పని ఏంటి? ప్రయోజనాలేంటో తెలిస్తే షాకే..
Isro
Follow us on

ఇస్రో (ISRO -భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) మరోసారి ప్రయోగాన్ని విజయవంతం చూసింది. ఆగస్టు 16న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి3 రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. SSLV-D3 రాకెట్‌లోని EOS-8 ఉపగ్రహం కొత్త, భవిష్యత్తు సాంకేతికతలతో నిండి ఉందని.. ఇది ఇస్రో, భారతదేశ ప్రజల కలలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. SSLV-D3-EOS-08 రాకెట్ భూమిని పర్యవేక్షించేందుకు రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఈ ఉపగ్రహంలో మూడు పేలోడ్‌లు ఇన్‌స్టాల్ చేసింది ఇస్రో. ఈ ఉపగ్రహాలు భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి.

ఉపగ్రహ లక్షణాలు:

  • ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-08) అనేది భూమిని పర్యవేక్షించే ఉపగ్రహం. అలాగే ఏదైనా విపత్తు గురించి ముందస్తు హెచ్చరికను కూడా అందిస్తుంది.
  • ఇది ఏదైనా విపత్తును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
  • ఈ ఉపగ్రహం బరువు దాదాపు 175.5 కిలోలు.
  • ఇందులో మూడు పేలోడ్‌లు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ (EOIR), రెండవది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (GNSS-R), మూడవది SIC UV డోసిమీటర్.
  • దీని పొడవు సుమారు 34 మీటర్లు.
  • ఈ ఉపగ్రహాన్ని, స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసిన 0.2 కిలోల SR-0 డెమోసాట్‌ను 475 కిమీ వృత్తాకార కక్ష్యలో భూమధ్యరేఖకు 37.4 డిగ్రీల వంపుతో, లిఫ్ట్-ఆఫ్ అయిన 17 నిమిషాల తర్వాత ఉంచింది.
  • అలాగే ఈ ఉపగ్రహంలోని పేలోడ్ భవిష్యత్తులో మానవ సహిత మిషన్ గగన్‌యాన్ కోసం UV రేడియేషన్‌ను పర్యవేక్షిస్తుంది. గామా రేడియేషన్ కోసం అధిక అలారం సెన్సార్‌గా పనిచేస్తుంది.
  • ఈ ఉపగ్రహం ఫోటోలు 24 గంటలూ క్యాప్చర్ చేయడానికి రూపొందించబడింది.
  • మరో ఉపగ్రహం సముద్రాలు, పర్వతాలు, మంచు కవచం, అడవులు వంటి భూమి లక్షణాలను విశ్లేషిస్తుంది.
  • మరో ఉపగ్రహం అంతరిక్షంలో అతినీలలోహిత వికిరణాన్ని కొలవడానికి రూపొందించబడింది.
  • ఈ ఉపగ్రహం సహాయంతో పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, భూకంపం, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటివి చేయవచ్చు.
  • భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి ఇది పని చేస్తుంది.
  • దీనిలో ఇన్‌స్టాల్ చేయబడిన EOIR పగలు, రాత్రి సమయంలో ఏర్పడే తరంగాల గురించి ఫోటోలను పంపిస్తుంది.
  • ఈ ఉపగ్రహ సముద్ర ఉపరితల గాలి, నేల తేమను తనిఖీ చేయడానికి, వరదలను గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి