Smart Phone Into TV Remote: టీవీ రిమోట్ పోయిందా..? ఆ యాప్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా మార్చుకోండి..
పెరిగిన టెక్నాలజీ ప్రకారం ప్రస్తుతం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ రిమోట్‌గా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గూగుల్ టీవీ యాప్ సాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీని నియంత్రించవచ్చు. రిమోట్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఛానెల్‌లను మార్చవచ్చు.

మనలో చాలా మంది టీవీ రిమోట్‌ను విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. ముఖ్యంగా టీవీ రిమోట్‌ను ఎక్కడ పెట్టామో? మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు సోఫా లేదా మంచం కింద దొరుకుతూ ఉంటుంది. మరికొన్నిసార్లు ఇంట్లో వారు వేరే చోట పెడుతూ ఉంటారు. ఎంత వెతికినా అది దొరకడం కష్టం అవుతుంది. రిమోట్‌ను పోగొట్టుకోవడం వల్ల మనం ఒక్కోసారి టీవీను కూడా చూడలేని పరిస్థితి వస్తుంది. అయితే పెరిగిన టెక్నాలజీ ప్రకారం ప్రస్తుతం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ రిమోట్‌గా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గూగుల్ టీవీ యాప్ సాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీని నియంత్రించవచ్చు. రిమోట్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఛానెల్‌లను మార్చవచ్చు. అలాగే వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు. అలాగే మీకు ఇష్టమైన యాప్‌లను కూడా ప్రారంభించవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లో గూగుల్ టీవీ యాప్‌ని ఎలా సెట్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీ రిమోట్‌గా మార్చండిలా
- గూగుల్ ప్లే స్టోర్‌ని తెరిచి గూగుల్ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
- మీ టీవీ, ఫోన్ ఒకే వైఫై నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ టీవీకి వైఫై లేకపోతే, మీరు మీ ఫోన్, టీవీని కనెక్ట్ చేయడానికి బ్లూటూత్‌ని కూడా ఉపయోగించవచ్చు.
- ఇప్పుడు గూగుల్ టీవీ యాప్‌ను తెరవండి. యాప్ తెరిచిన తర్వాత, దిగువ కుడి వైపున ఉన్న రిమోట్ బటన్‌ను నొక్కండి.
- యాప్ పరికరాల కోసం స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది. మీ టీవీ కనుగొన్న తర్వాత జాబితా నుంచి దాన్ని ఎంచుకోండి.
- మీ టీవీ స్క్రీన్‌పై కోడ్ కనిపిస్తుంది. యాప్‌లో కోడ్‌ని నమోదు చేసి పెయిర్ చేయాలి.
- మీ ఫోన్‌ను మీ టీవీతో జత చేసిన తర్వాత మీరు సాధారణ రిమోట్‌తో నియంత్రించినట్లుగా టీవీని నియంత్రించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
ఐఫోన్‌ను టీవీ రిమోట్‌గా మార్చండిలా
- మీ ఐఫోన్, టీవీ ఒకే వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేశారని నిర్ధారించుకోవాలి.
- యాప్ స్టోర్ నుంచి గూగుల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
- మీ ఐఫోన్‌లో గూగుల్ టీవీ యాప్‌ను తెరవాలి.
- స్క్రీన్ కుడి దిగువ మూలన ఉన్న టీవీ రిమోట్ చిహ్నంపై నొక్కాలి.
- యాప్ ఆటోమేటిక్‌గా మీ టీవీ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అది మీ టీవీని కనుగొనలేకపోతే పరికరాల కోసం స్కాన్ బటన్‌పై నొక్కండి.
- మీ టీవీ కనుగొన్న తర్వాత దాన్ని ఎంచుకుని మీ టీవీ స్క్రీన్‌పై కనిపించే 6-అంకెల కోడ్‌ను నమోదు చేయండి.
- మీ ఐఫోన్‌ను మీ టీవీకి కనెక్ట్ చేయడానికి పెయిర్‌పై నొక్కాలి.
- మీ ఐఫోన్‌ని మీ టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత మీరు సాధారణ రిమోట్ కంట్రోల్‌తో మీ టీవీని నియంత్రించినట్లుగానే దాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఛానెల్‌ని మార్చడానికి, వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికి, ప్లేబ్యాక్‌ని నియంత్రించడానికి యాప్ ద్వారా టీవీని కంట్రోల్ చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




