Instagram: ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా కేవలం..

|

Jun 22, 2024 | 7:38 AM

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఏదైనా లైవ్‌ స్ట్రీమింగ్ చేస్తే ఫాలోవర్స్‌ అందరికీ కనిపిస్తుందని తెలిసిందే. అయితే అలా కాకుండా కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే లైవ్‌ స్ట్రీమింగ్ కనిపించేలా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది...

Instagram: ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా కేవలం..
Instagram
Follow us on

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువతను పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తూ కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ యువతకు బాగా చేరువైంది. ఇందులోని ఫీచర్ల కారణంగా ఇన్‌స్టా యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఏదైనా లైవ్‌ స్ట్రీమింగ్ చేస్తే ఫాలోవర్స్‌ అందరికీ కనిపిస్తుందని తెలిసిందే. అయితే అలా కాకుండా కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే లైవ్‌ స్ట్రీమింగ్ కనిపించేలా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘క్లోజ్‌ ఫ్రెండ్స్ ఆన్‌ లైవ్‌’ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇంతకీ ఫీచర్‌ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆన్‌ లైవ్‌’ ఫీచర్‌ సహాయంతో క్లోజ్ ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్నవారికి మాత్రమే లైవ్‌ స్ట్రీమింగ్ కనిపించేలా చేసుకోవచ్చు. ఇక జాబితాలో మీకు నచ్చిన వారిని యాడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతంలో ఇన్‌స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్‌ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.

ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్‌లో ఇన్‌స్టాలో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ సహాయంతో గ్రిడ్‌లో పోస్ట్‌లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..