Infinix Note 30 VIP 5G: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ధరల ఫోన్‌లను విడుదల చేసే కంపెనీల్లో ఇన్ఫినిక్స్ అగ్రగామి సంస్థ. ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్-ధర స్మార్ట్‌ఫోన్‌లకు పేరుగాంచిన Infinix కంపెనీ ఇప్పుడు Infinix Note 30 VIP 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్‌లతో మార్కెట్‌లోకి రాబోతోంది. 8GB RAM + 256GB, 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర మనదేశంలో సుమారుగా రూ. 24,645 ఉండవచ్చు. ఇక ఈ ఫోన్ మ్యాజిక్ బ్లాక్, గ్లేసియర్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
ఫోన్ ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. ఇది 1080 x 2400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఎంపికతో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా 900 నిట్ బ్రైట్‌నెస్, ఆండ్రాయిడ్ 13 OS సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఫోటోగ్రఫీ కోసం ఈ Infinix Note 30 VIP 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 1/1.67 Samsung HM6 సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. దీనితో పాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది
ఇవే కాక దీర్ఘకాలం పనిచేసేలా 5,000mAh బ్యాటరీ బ్యాకప్‌తో, 68W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ ఇస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇది కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, GBL సౌండ్, బ్లూటూత్ 5.2, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..