టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటైన ఇన్ఫినిక్స్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ నోట్ 40ఎక్స్ 5జీని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో తర్వాత వస్తున్న మోడల్ ఇది. దీని ధర రూ. 15,000 కంటే తక్కువకే ఉండనున్నట్లు పేర్కొంది. కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ స్మార్ట్ రెండు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 8జీబీ, 12జీబీ. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ ఆధారంగా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా నడుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్, ధర, స్పెక్స్, లభ్యత గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ఫోన్ ఆగస్తు 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 13,499గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు మెమరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 12జీబీ+256జీబీ ధర రూ. 14,999, 8జీబీ+256జీబీ ధర రూ. 13,499కి లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిప్ కార్ట్ లో బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మూడు డైనమిక్ గ్రేడియంట్ రంగులలో అందుబాటులో ఉంటుంది: పామ్ బ్లూ, లైమ్ గ్రీన్, స్టార్‌లిట్ బ్లాక్. నో-కాస్ట్ ఈఎంఐ 8జీబీ+256జీబీ వేరియంట్‌కు రూ. 2,250, 12జీబీ+256జీబీకి రూ. 2,500 నుంచి ప్రారంభమవుతుంది. ఈ తాజా ఆఫర్ మీకు సమీపంలోని ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ రెండు మెమరీ కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇది రోజువారీ పనుల నుంచి రిసోర్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్‌లు, మొబైల్ గేమింగ్ వరకు ప్రతిదానికీ బలమైన పనితీరును అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లో 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ ఏఐ కెమెరా సెటప్‌ను క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది. ఇది ఏఐ క్యామ్, పోర్ట్రెయిట్ మోడ్, ఏకకాలంలో ముందు, వెనుక కెమెరా రికార్డింగ్ కోసం డ్యూయల్ వీడియో మోడ్, ప్రో మోడ్, సినిమాటిక్ వీడియో క్యాప్చర్ కోసం ఫిల్మ్ మోడ్‌తో సహా 15కి పైగా కెమెరా మోడ్‌లను కలిగి ఉంది. ముందువైపు 8-మెగాపిక్సెల్ తో ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డివైస్‌లో పంచ్ హోల్ డిస్‌ప్లే, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ ఉంది. స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది. పరికరం 18వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. పరికరంలో ఏఐ ఛార్జ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇన్పినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ తాజా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..