కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ప్రజలు చాలా మంది తమ తమ ఇళ్లలోనే ఉండి నెలల తరబడి పనులు చేసుకున్నారు. కరోనా కారణంగా బయటికి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో టీవీ, మొబైల్ ఫోన్లలో మునిగిపోయారు. గంటలు గంటలు మొబైల్ ఫోన్లకే పరిమితం అయ్యారు. యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని టైమ్‌పాస్ చేశారు.

లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువగా ఏం చేశారనే దానిపై ప్రముఖ యాప్ అనలిటిక్స్ సంస్థ యాప్ అన్నె(App Annie) కీలక నివేదిక బహిర్గతం చేసింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు గంటల తరబడి యాప్స్‌లతోనే టైమ్‌పాస్ చేశారట. దాదాపు రోజులో 4.2 గంటల సమయం యాప్స్‌లో ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారట.

జనవరి, మార్చి నెలల మధ్య ఆపిల్ యాప్ స్టోర్.. గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్‌లను ప్రజలు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

కొన్ని దేశాల్లో సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లను అధికంగా ఉపయోగించారని నివేదికలో పేర్కొన్నారు. వినియోగం పరంగా సిగ్నల్ యాప్- యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో మొదటి స్థానంలో ఉండగా.. యూఎస్‌లో నాలుగో స్థానంలో ఉంది. టెలిగ్రామ్- యూకేలో తొమ్మిదవ స్థానంలో ఉండగా.. ఫ్రాన్స్‌లో 5వ స్థానం, యూఎస్‌లో 7వ స్థానంలో నిలిచింది.

భారతదేశంలో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయ యాప్‌గా ఉద్భవించిన ఎంఎక్స్ టకాటక్ యాప్.. జనవరి నుండి మార్చి మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా అవతరించింది. ఇక డౌన్‌లోడ్ చార్టులో టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి.