Bhasha Sangam: దేశంలో అన్ని భాషలూ నేర్చేసుకోండి సింపుల్‌గా.. సర్టిఫికేట్ కూడా ఇంటిలో కూచునే సంపాదించవచ్చు..ఎలాగంటే..

దేశ ప్రజలలో భాషా జ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వం మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ పేరు భాషా సంగం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రచారం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కింద ఈ మొబైల్ యాప్ రూపొందించారు.

Bhasha Sangam: దేశంలో అన్ని భాషలూ నేర్చేసుకోండి సింపుల్‌గా.. సర్టిఫికేట్ కూడా ఇంటిలో కూచునే సంపాదించవచ్చు..ఎలాగంటే..
Bhasa Sangam App

Updated on: Dec 12, 2021 | 4:55 PM

Bhasha Sangam: దేశ ప్రజలలో భాషా జ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వం మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ పేరు భాషా సంగం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రచారం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కింద ఈ మొబైల్ యాప్ రూపొందించారు. యాప్ పూర్తిగా ఉచితం. ఎవరైనా దీన్ని తమ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ భాషలను నేర్చుకోవచ్చు. ఈ యాప్‌లో దేశంలోని 22 భాషలు ఉన్నాయి. వీటిని నేర్చుకోవచ్చు.. చదవవచ్చు. భాషా అభ్యాసానికి ఆటలు ఏర్పాటు చేశారు ఈ యాప్ లో. అంటే, యాప్‌లో గేమ్స్ ప్లే చేయడం ద్వారా చాలా భాషలు సులభంగా నేర్చుకోవచ్చు.

ఈ యాప్ పూర్తిగా ఆన్‌లైన్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఈ యాప్ మొబైల్ యూజర్ వివిధ భాషలను నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. యాప్‌లో ఉన్న భాషను నేర్చుకోవాలనుకునే ఎవరైనా దానిని నేర్చుకోవచ్చు. భారతదేశంలోని 22 అధికారిక భాషలు యాప్‌లో ఉన్నాయి. దీని అభ్యాసం పూర్తిగా ఉచితం. ఈ 22 భాషల్లో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి, డోగ్రీ ఉన్నాయి. .

ఈ యాప్‌ను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ లింగ్విస్టిక్ మొబైల్ యాప్ ద్వారా రోజువారీ ప్రసంగం.. భాషలో ఉండే పదాలు.. వాక్యాలను నేర్చుకోవచ్చు. భాషతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు. ‘భాషా సంగం’ మొబైల్ యాప్ కొన్ని ప్రత్యేకతలు ఇవే..

  • ఈ లెసన్ యాప్ సులభంగా నేర్చుకోవడానికి గేమ్ లాగా రూపొందించారు.
  • వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నలు.. సమాధానాలు వ్యక్తిగతీకరించిన ప్రాతిపదికన రూపొందించారు. ఇది భాషా అభ్యాసంలో సహాయపడుతుంది
  • వినియోగదారు ఖచ్చితత్వ స్థాయిని తనిఖీ చేయడానికి.. ప్రతిరోజూ పురోగతిని తనిఖీ చేయడానికి రోజువారీ అభ్యాస వ్యవస్థ సృష్టించారు.
  • భాషకు సంబంధించిన పదబంధాలను వినియోగదారు సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాల సహాయంతో భాషా పరిజ్ఞానం అందించారు.
  • దేశంలోని విభిన్న సంస్కృతిని తెలుసుకోవడానికి..అర్థం చేసుకోవడానికి 44 ప్రత్యేక పాత్రలు సృష్టించారు.
  • వివిధ భాషలలో ఉన్న 500 సాంస్కృతిక చిట్కాలు ఇందులో ఉన్నాయి. ఇది మన సంస్కృతితో కనెక్ట్ అయ్యే ప్రయోజనాన్ని ఇస్తుంది
  • ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చిన వెంటనే ఫీడ్‌బ్యాక్ వచ్చేలా వ్యవస్థ రూపొందించారు.
    పురోగతి గురించి తెలుసుకోవడానికి ప్రతి పాఠం పూర్తయిన తర్వాత స్టార్ స్కోర్ ఉంటుంది.
  • మీరు ఎంత నేర్చుకుని ఎంత పురోగతి సాధించారు అనే దాని ఆధారంగా పొందిన స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుంది.
  • మొబైల్ వినియోగదారు భాషా సంగం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అతనికి/ఆమెకు తెలిసిన ..భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలను నేర్చుకోవచ్చు. అభ్యాసం ఆధారంగా, వినియోగదారు
  • తన స్వంత పరీక్షను నిర్వహించవచ్చు. దాని ఆధారంగా ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్‌ను సాధించవచ్చు. ఈ మొబైల్ యాప్‌ను దేశంలో ఒకే ఒక స్టార్టప్ మల్టీభాషలలో తయారు చేసింది. ఈ యాప్ ఉద్దేశ్యం పాఠశాల పిల్లలకు ముఖ్యంగా రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ భాషల గురించి సమాచారాన్ని అందించడం.

ఇవి కూడా చదవండి: America Hurricane: విరుచుకుపడిన హరికేన్లతో అమెరికాలో ఆరు రాష్ట్రాలు అతలాకుతలం.. ఫోటోలలో తుపాను విధ్వంసం చూడండి!

Omicron Stealth: వామ్మో.. ఆ దేశాల్లో ఒమిక్రాన్ కొత్త వెర్షన్ జాడలు..మామూలు టెస్టులకు ఇది చిక్కడంలేదంటున్న నిపుణులు!