Face Mask: మాస్క్ ఎందుకు దండగ.. వచ్చేసింది అధునాతన ఎయిర్ ప్యూరిఫైయర్‌..ఇది ఎలా పనిచేస్తుందంటే..

|

Feb 25, 2022 | 9:05 PM

కరోనా వచ్చిన తరువాత ముక్కును కప్పేసే మాస్క్(Face Mask) లు ధరించడం తప్పనిసరిగా మారిపోయింది. ఎంత ఇబ్బంది ఉన్నా.. కరోనాను నిలువరించడానికి ప్రధమ ఆయుధంగా మాస్క్ ను నిపుణులు పేర్కొన్నారు.

Face Mask: మాస్క్ ఎందుకు దండగ.. వచ్చేసింది అధునాతన ఎయిర్ ప్యూరిఫైయర్‌..ఇది ఎలా పనిచేస్తుందంటే..
Naso 95
Follow us on

కరోనా వచ్చిన తరువాత ముక్కును కప్పేసే మాస్క్(Face Mask) లు ధరించడం తప్పనిసరిగా మారిపోయింది. ఎంత ఇబ్బంది ఉన్నా.. కరోనాను నిలువరించడానికి ప్రధమ ఆయుధంగా మాస్క్ ను నిపుణులు పేర్కొన్నారు. అందుకే మాస్క్ వాడటం కచ్చితమైన అవసరం అయిపొయింది. అయితే, మాస్క్ తో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిగా ముక్కును నోటిని కప్పి ఉంచడంతో చాలా మంది ఊపిరి పీల్చడంలో అసౌకర్యాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. మాస్క్ కంటే మెరుగైన పరికరం ఉంటె బావుండు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అటువంటి వారి కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీకి చెందిన స్టార్టప్ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్‌ను రూపొందించింది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఇది ప్రపంచంలోనే ధరించగలిగే అతి చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్. అలాగే ఇది N-95 మాస్క్ వలె ప్రభావవంతంగా ఉంటుంది. దీనికి శాస్త్రవేత్తలు Naso 95 అని పేరు పెట్టారు.

ఈ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా పని చేస్తుంది?

ఐఐటీ ఢిల్లీకి చెందిన స్టార్టప్ నానోక్లీన్ గ్లోబల్ నాసో-95 పేరుతో ఈ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్‌ను విడుదల చేసింది. ఇది N-95 గ్రేడ్ నాసల్ ఫిల్టర్. ఇది నేరుగా ముక్కులోనే అమర్చుకోవచ్చు. దీని వల్ల మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు దుమ్ము, వైరస్, బ్యాక్టీరియా వంటివి మన శరీరంలోకి చేరవు.

Naso-95 నాలుగు వేర్వేరు పరిమాణాలలో అందుబాటులో ఉంది. పెద్దలతో పాటు, పిల్లలు కూడా దీనిని ఉపయోగించవచ్చు. సాధారణ మాస్క్ వదులుగా ఉండటంతో ఒక్కోసారి సరైన రక్షణ ఇవ్వలేదు. కానీ, Naso 95 ముక్కులో అమర్చుకోవడం వలన చాలా చక్కని పనితీరును కనిపిస్తుంది. ఈ ఉత్పత్తిని జాతీయంగా.. అంతర్జాతీయంగా పరీక్షించారు.

నాసో-95 అన్ని వయసుల వారికి ప్రయోజనకరం..

భారత ప్రభుత్వ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ సెక్రటరీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ NASO-95 ఉపయోగించడానికి చాలా సులభంగా అదేవిధంగా సౌకర్యంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉత్పత్తిని సామాన్యుల వద్దకు తీసుకెళ్లడంలో స్టార్టప్‌కు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.

వైరస్‌ కంటే వాయు కాలుష్యం ప్రమాదకరం

NASO-95 ప్రయోగ కార్యక్రమానికి హాజరైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ MC మిశ్రా మాట్లాడుతూ, వైరస్ కంటే వాయు కాలుష్యం చాలా తీవ్రమైన సమస్య అని అన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సర్వసాధారణం. అటువంటి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధుల నుండి మనలను రక్షించడంలో Naso-95 వంటి ఉత్పత్తులు ఉపయోగపడతాయి.

నాసో-95 కరోనా సమయంలో చాలా ఉపయోగకరమైన పరికరం అని డాక్టర్ మిశ్రా అన్నారు. ఇది మనం మాస్క్‌ని తీయాల్సిన ప్రదేశాలలో వైరస్ నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. విమానాశ్రయాలు, భద్రతా తనిఖీలు మొదలైన చోట్ల గుర్తింపు కోసం మాస్క్‌ను తీసివేయడం అవసరం అనే విషయం తెలిసిందే.

Also Read: Hyderabad: భాగ్యనగరంలో ఆ మూడు రోజులు ఇంటింటికి బూస్టర్ డోసు బంద్.. ఎందుకంటే..

Booster Dose: బూస్టర్‌ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి