
నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడని వారు ఉండడం చాలా తక్కువ. ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే ఏం తోచదు. అయితే ఫోన్ పోయినప్పుడు ఎంతో బాధపడతారు. ముఖ్యంగా IMEI నంబర్ కూడా గుర్తు లేకపోతే పోయిన ఫోన్‌ను తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. దొంగలు వెంటనే సిమ్ తీసేయడం లేదా ఫోన్‌ను ఫార్మాట్ చేయడం చేస్తుంటారు కాబట్టి, సాధారణ ట్రాకింగ్ పద్ధతులు కూడా పనిచేయవు. అయితే కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్‌లు, యాప్‌లను ముందుగానే ఆన్ చేయడం ద్వారా మీ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి ఫోటోను మీరే పొందవచ్చు.
ఈ టెక్నాలజీ ద్వారా మీ ఫోన్ చోరీ అయితే ఆ ఫోన్ స్వయంగా దొంగ ఫోటో తీసి మీకు పంపుతుంది. దొంగ సిమ్ కార్డు తీసేసినా లేదా ఫోన్‌ను ఫార్మాట్ చేసినా మీకు దొరికిన ఫోటోతో దొంగను పట్టుకోవడం సులభమవుతుంది.
మీరు మీ మొబైల్‌లో ఈ అద్భుతమైన ఫీచర్‌ను పొందాలనుకుంటే.. ముందుగా ప్లే స్టోర్ నుండి నమ్మకమైన యాంటీ థెఫ్ట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైనవి..
మీరు థీఫ్ సెల్ఫీ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత ఎవరైనా మీ ఫోన్‌ను దొంగిలించినా.. తప్పు పాస్‌వర్డ్ నమోదు చేసినా లేదా సిమ్ కార్డును మార్చినా, ఫోన్ వెంటనే సెల్ఫీ కెమెరా ద్వారా దొంగ ఫోటో తీసి, మీరు నమోదు చేసిన మెయిల్ ఐడీకి పంపిస్తుంది. మీరు వేరే ఫోన్‌లో మీ మెయిల్‌ను తెరిచి ఆ ఫోటో వివరాలను పోలీసులకు అందించవచ్చు. అయితే ఈ ఫీచర్ కోసం ఎప్పుడూ ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి