
Hyundai Bayonలో భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, Level 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2027 జనవరిలో CNG వేరియంట్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద డిస్‌ప్లేలు, ఆధునిక భద్రతా సదుపాయాలు కోరుకునే కస్టమర్లను ఈ SUV ఆకట్టుకోవచ్చు. దీని డిజైన్, ఫీచర్లు, ఇంజన్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
Hyundai Bayon ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, L-ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. 17 ఇంచుల అల్లాయ్ వీల్స్, బ్లాక్ క్లాడింగ్, వెనుక LED టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ SUV పొడవు 4,245 మి.మీ., వెడల్పు 1,810 మి.మీ., ఎత్తు 1,605 మి.మీ. వీల్‌బేస్ 2,600 మి.మీ. కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 205 మి.మీ. బూట్ స్పేస్ 505 లీటర్లు.
క్యాబిన్‌లో డ్రైవర్ సమాచారం కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి చొప్పున రెండు 12.3 ఇంచుల డిస్‌ప్లేలు ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, ముందు వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, Bose సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌డేట్స్ సపోర్ట్ కూడా అందించనున్నారు.
ఈ SUVలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 115hp పవర్, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. CVT వేరియంట్ లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సమాచారం.
ఈ SUV మార్కెట్లోకి వస్తే మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి మోడళ్లకు పోటీ ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజీ, విశాలమైన క్యాబిన్ కోరుకునే కుటుంబ వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.