Huawei Watch GT4: మార్కెట్లోకి మరో ప్రీమియం స్మార్ట్ వాచ్.. సింగిల్ చార్జ్‌పై రెండు వారాల వరకూ బ్యాటరీ లైఫ్..
హువావే కంపెనీ కూడా స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇటీవలే హువావే వాచ్ జీటీ3ని ఆవిష్కరించిన ఆ కంపెనీ ఇప్పుడు మరో వాచ్ హువావే వాచ్ జీటీ4 ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది 41ఎంఎం, 46ఎంఎం డయల్ సైజులలో అందుబాటులో ఉంటుంది, స్మార్ట్ వాచ్ 466 × 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందించే అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్-స్టీల్ కేస్, రోటేటింగ్ క్రౌన్, సైడ్ బటన్ ను కలిగి ఉంది.
అన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్మార్ట్ వాచ్ తయారు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. పలు స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్ ల తయారీపై దృష్టి పెడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ వాచ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటమే. ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ తమ మణికట్టుకు ఉండాలని భావిస్తున్నారు. ఎందుకంటే వాటిలోని ఫీచర్లు అంత ఉపయుక్తంగా ఉంటున్నాయి. కేవలం సౌకర్యం, అందం కోసమే కాక ఆరోగ్యపరంగానూ ఉపయోగపడుతుండటంతో అందరూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో చైనాకు చెందిన హువావే కంపెనీ కూడా స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇటీవలే హువావే వాచ్ జీటీ3ని ఆవిష్కరించిన ఆ కంపెనీ ఇప్పుడు మరో వాచ్ హువావే వాచ్ జీటీ4 ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది 41ఎంఎం, 46ఎంఎం డయల్ సైజులలో అందుబాటులో ఉంటుంది, స్మార్ట్ వాచ్ 466 × 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందించే అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్-స్టీల్ కేస్, రోటేటింగ్ క్రౌన్, సైడ్ బటన్ ను కలిగి ఉంది. అంతేకాక అనేక స్మార్ట్ సెన్సార్‌లతో పాటు వైర్‌లెస్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ వాచ్ లోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు వారాల వరకు లైఫ్ ఇస్తుంది.
హువావే వాచ్ జీటీ 4 ధర, లభ్యత..
ఈ వాచ్ నాలుగు విభిన్న స్ట్రాప్ ఎంపికలతో వస్తోంది. 41ఎంఎం, 46ఎంఎం డయల్ సైజులలో అందుబాటులో ఉంది. హువావే వాచ్ జీటీ 4 41ఎంఎం వైట్ లెదర్ స్ట్రాప్, లైట్ గోల్డ్ మిలనీస్ స్ట్రాప్, సిల్వర్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాప్‌తో అందుబాటులో ఉంది. వాటి ధర వరుసగా 229 యూరోలు (దాదాపు రూ. 20,250), 249 యూరోలు (దాదాపు రూ. 22,000), 349 యూరోలు (దాదాపు రూ. 30,800).
అదేవిధంగా, హువావే వాచ్ జీటీ 4 46ఎంఎం బ్లాక్ ఫ్లూరోఎలాస్టోమర్ స్ట్రాప్, గ్రే స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాప్, గ్రీన్ కాంపోజిట్ స్ట్రాప్, బ్రౌన్ లెదర్ స్ట్రాప్‌తో అందుబాటులో ఉంది. వాటి ధర వరుసగా 229యూరోలు (దాదాపు రూ. 20,250), 249యూరోలు (దాదాపు రూ. 22,000), 299యూరోలు (దాదాపు రూ. 26,450).
హువావే వాచ్ జీటీ 4 స్పెసిఫికేషన్లు..
46ఎంఎం డయల్ తో వచ్చే వాచ్ 1.43-అంగుళాల అమోల్డ్ కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది, అయితే 41ఎంఎం వేరియంట్ 1.32-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. రెండు వేరియంట్‌లు 466 × 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తాయి. స్మార్ట్ వాచ్ అనేక ఫిట్‌నెస్-ట్రాకింగ్ ఫంక్షన్‌లతో వస్తుంది. యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్, టెంపరేచర్ సెన్సార్ వంటి స్మార్ట్ సెన్సార్‌లను పొందుతుంది.
ఇది హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే హువావే ట్రూసీన్ 5.5+ హార్ట్ రేట్ సెన్సార్‌తో పాటు, స్లీప్ మోనిటరింగ్, శ్వాస, ఒత్తిడి మానిటర్‌ల కోసం హువావే ట్రూ స్లీప్ 3.0 ట్రాకర్ కూడా ఉంటుంది. స్మార్ట్ వాచ్ స్మార్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ క్యాలెండర్‌ను కూడా అందిస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్‌తో వస్తుంది. ఇది బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీని కూడా అందిస్తుంది.
ఈ వాచ్ పవర్ సేవింగ్ మోడ్‌లో గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ జీవితాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఎల్లప్పుడూ ఆన్ లో ఉండే డిస్‌ప్లే(ఏఓడీ)ను ఎనేబుల్ చేస్తే నాలుగు రోజుల వరకు ఉంటుంది. అదే ఏఓడీని ఆఫ్ చేస్తే ఎనిమిది రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ వస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ లకు దేనికైనా మద్దతు ఇస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..