AI: ఏఐ ఫొటోలను.. ఏఐతోనే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసుకోండి..

|

Nov 30, 2024 | 3:50 PM

ప్రస్తుతం ఏఐతో డిజైన్‌ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఏ ఫొటో చూసినా అసలైందేనా.? నకిలీదా.? అన్న అనుమానం వస్తోంది. అయితే మనకు వచ్చిన ఫొటో నిజమైందేనా? లేదా నకిలీనా.? అని తెలుసుకోవడానికి కొన్ని రకాల ఏఐ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయన్న విషయం మీకు తెలుసా..

AI: ఏఐ ఫొటోలను.. ఏఐతోనే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసుకోండి..
Ai Photos
Follow us on

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ హవా నడుస్తోంది. రోజురోజుకీ ఏఐ వినియోగం భారీగా పెరుగుతోంది. దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నిజమైన ఫొటోలను పోలినట్లు ఉండే ఈ నకిలీ ఫొటోలు కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్‌ అవుతోన్న ఫొటోల్లో ఏది అసలైనా ఫొటో.? ఏది ఏతో చేసిన ఫొటో అనే విషయాన్ని తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. అయితే మనం చూసే ఫొటోలు నిజమైనవో కాదో అనే విషయాన్ని కూడా ఏఐతో తెలుసుకోవచ్చని మీకు తెలుసా.? కొన్ని సింపుల్‌ టిప్స్‌ సహాయంతో ఈ విషయాన్ని కనిపెట్టొచ్చు. ఇంతకీ ఈ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫొటోను గూగుల్‌లో రివర్స్‌ ఇమేజ్‌ చేయడం ద్వారా అది ఏఐ ఫొటోనా, నార్మల్‌ ఫొటోనో తెలుసుకోవచ్చు. ఫొటోను కాపీ చేసి గూగుల్ సెర్చ్‌లో వేయడం ద్వారా ఆ ఫొటో సోర్స్‌ ఎక్కడిదన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే గూగుల్‌ లెన్స్‌లో స్కాన్‌ చేయడం ద్వారా కూడా ఫొటో అసలా.? నకిలీనా.? తెలుసుకోవచ్చు. ఇక ఏఐ ఇమేజ్‌ డిటెక్టర్‌ ఫీచర్స్‌ సహాయంతో కూడా ఫొటో అసలా.? ఏఐతో చేశారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఇందుకోసం హైవ్ మోడరేషన్, ఆప్టిక్ AI ఆర్‌ నాట్‌, మేబేస్‌ ఏఐ ఆర్ట్ డిటెక్టర్ వంటి ఇమేజ్ డిటెక్టర్ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫొటోలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఇమేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గూగుల్‌ ఏఐ టూల్‌ బార్డ్‌ కూడా ఈ విషయాన్ని చెప్పేస్తుంది. గూగుల్‌ చాట్‌ బాట్‌లో ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఆ ఫొటో అసలైందేనా.?కాదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..