మీరు గేమ్స్ ఆడతారా? ప్రత్యేకంగా మీ కోసం ట్యాబ్​ తెచ్చేసింది Honor.. ప్రత్యేకతలు ఇవే

గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా హానర్ సంస్థ కొత్త ట్యాబ్లెట్‌ను చైనాలో విడుదల చేసింది. HONOR WIN Tablet పేరుతో వచ్చిన ఈ డివైజ్‌లో 8.4 అంగుళాల OLED డిస్‌ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. హై-ఎండ్ గేమింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ ట్యాబ్లెట్‌లో 10,000mAh భారీ బ్యాటరీ, ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.

మీరు గేమ్స్ ఆడతారా? ప్రత్యేకంగా మీ కోసం ట్యాబ్​ తెచ్చేసింది Honor.. ప్రత్యేకతలు ఇవే
Honor Win Tablet

Updated on: Oct 23, 2026 | 8:20 PM

HONOR WIN Tabletలో గేమింగ్ సమయంలో వేగవంతమైన స్పందన, మెరుగైన గ్రాఫిక్స్, స్థిరమైన పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులోని అధునాతన హార్డ్‌వేర్‌తో పాటు గేమింగ్ సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చుకునే సాఫ్ట్‌వేర్ సదుపాయాలు వినియోగదారులకు ఉపయోగపడతాయి. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఈ ట్యాబ్లెట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

240Hz OLED డిస్‌ప్లే..

ఈ ట్యాబ్లెట్‌లో 8.4 అంగుళాల OLED స్క్రీన్‌ను అందించారు. ఇది 2304×1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 324 PPI, 93% స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. 240Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 185Hz, 165Hz, 120Hz, 90Hz, 60Hz మోడ్‌లకు సపోర్ట్ ఉంది. 40కి పైగా గేమ్స్‌లో 240Hz రిఫ్రెష్ రేట్‌ను ఉపయోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది.

పనితీరు కోసం 3nm Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్, Adreno 840 GPU ఉన్నాయి. వేడిని నియంత్రించేందుకు డ్యూయల్ VC సింక్రోనస్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్, హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం డ్యూయల్ X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్లు అందించారు. ‘Geek Center’ ద్వారా రిఫ్రెష్ రేట్, మెమరీ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. ‘Full Throttle’ మోడ్ గరిష్ఠ పనితీరును అందిస్తుంది.

10,000mAh బ్యాటరీ..

HONOR WIN Tabletలో 10,000mAh బ్యాటరీ ఉంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ద్వారా బ్యాటరీని నేరుగా ఛార్జ్ చేయకుండా ట్యాబ్లెట్‌కు పవర్ అందించవచ్చు. కెమెరాల విషయానికి వస్తే 13MP ఆటోఫోకస్ వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Android 17 ఆధారిత MagicOS 11తో పనిచేస్తుంది. Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C కనెక్టివిటీ సదుపాయాలు కూడా ఉన్నాయి.

ధరల విషయానికి వస్తే, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లు (సుమారు రూ.63,650). 16GB RAM + 512GB వేరియంట్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.77,795)గా నిర్ణయించారు. చైనాలో అక్టోబర్ 31 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్లో విడుదలపై ఇంకా అధికారిక సమాచారం లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us