Royal Enfield‌కు పోటీగా Honda కొత్త బైక్.. ఇంజిన్‌ కెపాసిటీ గురించి తెలిస్తే చెమటలు పట్టాల్సిందే

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Honda భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. Honda CB500 పేరుతో ఈ మోడల్‌ను విడుదల చేసింది. 500cc సెగ్మెంట్‌లో కొత్త బైక్ కొనాలని చూస్తున్న వారికి ఇది మరో ఆప్షన్‌గా నిలవనుంది. అల్లాయ్ వీల్స్‌, స్పోక్ వీల్స్‌ ఆప్షన్లతో మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బేస్ వేరియంట్ ధరను రూ.2.75 లక్షలుగా నిర్ణయించడం ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.

Royal Enfield‌కు పోటీగా Honda కొత్త బైక్.. ఇంజిన్‌ కెపాసిటీ గురించి తెలిస్తే చెమటలు పట్టాల్సిందే
Honda Cb500

Updated on: Nov 26, 2026 | 8:00 AM

బైక్ మార్కెట్లో ప్రస్తుతం 500cc సెగ్మెంట్‌పై ఆసక్తి చూపుతున్నవారికి Honda CB500 ప్రత్యేకంగా నిలవనుంది. ఇందులో శక్తివంతమైన ఇంజన్‌తో పాటు డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు వేరియంట్లలో వీల్స్‌, గ్రాఫిక్స్ పరంగా తేడాలు ఉండనున్నాయి. ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. 2026 చివరి నాటికి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది.

501cc ఇంజన్..

Honda CB500లో 501cc సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 5,250rpm వద్ద 28hp గరిష్ట పవర్‌, 3,750rpm వద్ద 43.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. గేర్లు సులభంగా మార్చుకునేందుకు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ను అందించారు. భారత మార్కెట్లో Honda అందిస్తున్న అతిపెద్ద ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ ఇదే.

వేరియంట్ల విషయానికి వస్తే.. Alloy మోడల్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది. Spoke వేరియంట్ ధర రూ.3 లక్షలు కాగా, Spoke with Stripe టాప్ వేరియంట్ ధర రూ.3.02 లక్షలుగా నిర్ణయించారు. బేస్ మోడల్‌లో అల్లాయ్ వీల్స్‌ ఉండగా, మిగిలిన రెండు వేరియంట్లలో స్పోక్ వీల్స్‌ లభిస్తాయి. టాప్ వేరియంట్‌లో ప్రత్యేక రంగులు, గ్రాఫిక్స్ అందించారు.

డ్యూయల్ ఛానల్ ABS..

సేఫ్టీ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. ముందు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ప్రీలోడ్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు అందించారు. Honda Selectable Torque Control (HSTC), అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, Honda RoadSync కనెక్టివిటీ ఫీచర్లు అన్ని వేరియంట్లలోనూ ఉన్నాయి. బైక్ కర్బ్ వెయిట్ 189 కిలోలు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 168 మి.మీ.

ఇక పోటీ విషయానికి వస్తే.. 2020లో Royal Enfield తన 500cc UCE మోడళ్లను నిలిపివేసిన తర్వాత ఈ సెగ్మెంట్‌లో ఏర్పడిన ఖాళీని Honda CB500 భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.3.38 లక్షల నుంచి ప్రారంభమయ్యే Royal Enfield 650 Twins కంటే తక్కువ ధరకు ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. Honda CB500 కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 చివరి నాటికి మొదలయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us