ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు అంబ్రేన్ (Ambrane) భారత మార్కెట్ పై కన్నేసింది. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ ల తయారీలో తను సత్తా చాటుతోంది. బడ్జెట్ ధరల్లోనే అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాచ్ లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లను భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. అవుట్ డోర్ సిరీస్ గా కంపెనీ పేర్కొంటున్న ఆ వాచ్ లపేర్లు వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్. దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్, క్వాలిటీ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏడాది కాలం పాటు వారంటీని ఆ కంపెనీ అందిస్తోంది. లాంచింగ్ ఆఫర్లో వీటిని కేవలం రూ.2 వేలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిలో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్ ఉన్నాయి. కాగా వైజ్ క్రెస్ట్ రక్తపోటు ను కొలిచే ఫీచర్‌ను అదనంగా కలిగి ఉంది. అయితే వైజ్ స్టడ్‌లో బీపీని కొలిచే సామర్థ్యాన్ని అందించలేదు. ఈస్టెప్స్, కేలరీలు, దూరాన్ని ట్రాక్ చేయవచ్చు. 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ప్రయత్నించవచ్చు. 400ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు నిరంతర వాడకంలో గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ని ఆఫర్ చేస్తాయి. స్టాండ్ బై మోడ్‌లో 25 రోజులపాటు బ్యాకప్ ఇస్తాయి.
అంబ్రేన్ వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్ ధరలు వరుసగా రూ. 6499, రూ. 5,999 కాగా రెండింటిపై ప్రారంభ ఆఫర్ కింద రూ.1,999కే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ , కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వైజ్ క్రెస్ట్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో వస్తే.. వైజ్ స్టడ్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..