Google Pixel: గూగుల్ పిక్సల్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. కొత్తగా ఏమున్నాయంటే..

|

Aug 11, 2024 | 3:57 PM

ఆగస్టు 13న గూగుల్ హెడ్ క్వార్టర్ అయిన కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూ వద్ద నిర్వహించనున్న గూగుల్ ఈవెంట్ 2024లో గూగుల్ పిక్సల్ 9 సిరీస్ లాంచ్ చేసేందుకు అంతా సిద్ధమైంది. కాగా మనదేశంలో ఆగస్టు 14 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పిక్సల్ 9 లైనప్లో నాలుగు మోడళ్లు ఉన్నాయని..

Google Pixel: గూగుల్ పిక్సల్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. కొత్తగా ఏమున్నాయంటే..
Google Pixel 9 Series
Follow us on

గూగుల్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ పిక్సల్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మన దేశీయ మార్కెట్లో కూడా ప్రీమియం ఫోన్ గా గూగుల్ పిక్సల్ కు మంచి డిమాండే ఉంది. కాగా గూగుల్ నెక్ట్స్ జనరేషన్ గూగుల్ పిక్సల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 13న గూగుల్ హెడ్ క్వార్టర్ అయిన కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూ వద్ద నిర్వహించనున్న గూగుల్ ఈవెంట్ 2024లో గూగుల్ పిక్సల్ 9 సిరీస్ లాంచ్ చేసేందుకు అంతా సిద్ధమైంది. కాగా మనదేశంలో ఆగస్టు 14 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పిక్సల్ 9 లైనప్లో నాలుగు మోడళ్లు ఉన్నాయని.. ఇవన్నీ ఈ ఏడాదిలోనే పరిచయం కానున్నట్లు చెబుతున్నారు. పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ ప్రో ఎక్స్ఎల్, రీబ్రాండెడ్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్ కానున్నాయి. అంతేకాక ఇదే ఈవెంట్లో గూగుల్ పిక్సల్ వాచ్ 3తో పాటు ఏఐకి సంబంధించిన మరిన్ని ప్రకటనలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

కొత్త పిక్సెల్ 9 లైనప్..

గూగుల్ తన పిక్సెల్ లైనప్‌లో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నారు. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మాదిరిగా కాకుండా, గూగుల్ మూడు పిక్సెల్ ఫోన్‌లను, ఒక ఫోల్డబుల్ మోడల్‌ను పరిచయం చేస్తుందని తెలుస్తోంది.

పిక్సెల్ 9.. స్టాండర్డ్ పిక్సెల్ 9 మోడల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 12జీబీ ర్యామ్‌తో వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ కెమెరా సామర్థ్యంలో చెప్పుకోదగ్గ మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. తక్కువ కాంతిలోనూ మెరుగైన, నాణ్యమైన ఫొటోలను అందిస్తుంది.

పిక్సల్ 9 ప్రో.. ఇది 6.3-అంగుళాల డిస్‌ప్లే, 16జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రో మోడల్‌లోని కెమెరా సిస్టమ్ 48-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 42-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని ఆన్ లైన్ లోని పలు నివేదికలు చెబుతున్నాయి.

పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్.. ఈ వేరియంట్ 6.5 లేదా 6.9 అంగుళాల మధ్య పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది పెద్ద స్క్రీన్‌లను ఇష్టపడే వినియోగదారులకు ఆదర్శంగా ఉంటుంది. ఫోన్ టెన్సర్ జీ4 చిప్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ మాడ్యూల్, 16జీబీ ర్యామ్, 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 48-మెగాపిక్సెల్ జూమ్ లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. ముందు భాగంలో42-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చని చెబుతున్నారు.

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్.. గూగుల్ తన రెండవ తరం ఫోల్డబుల్ ఫోన్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఈ మోడల్ మరింత ఆకర్షణీయ డిజైన్ వస్తుందని భావిస్తున్నారు. ఇది టెన్సర్ జీ4 చిప్‌ని పిక్సల్ 9 సిరీస్‌తో పంచుకునే అవకాశం ఉంది. ఇది మెరుగైన పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తుంది. 8-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ స్క్రీన్‌తో, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ట్యాబ్లెట్‌గా లేదా ఫోన్‌గా ఉపయోగించుకునేలా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..