Google: మీరు గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగిస్తున్నారా.? హెచ్చరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం..

విండోస్‌, మ్యాక్‌ఓస్‌ ఆపరేటింగ్స్‌ సిస్టమ్స్‌లపై గూగుల్ క్రోమ్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌ హెచ్చరించింది. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో బగ్‌లు ఉన్నాయని హెచ్చరించారు. వీటిని ఉపయోగించుకుని...

Google: మీరు గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగిస్తున్నారా.? హెచ్చరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం..
Google Chrome
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 11, 2024 | 2:26 PM

ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే చేసే పని గూగుల్ ఓపెన్‌ చేయడం. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్లెట్స్‌లో కూడా బ్రౌజింగ్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మీరు కూడా మీ గ్యాడ్జెట్స్‌లో గూగుల్ క్రోమ్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

విండోస్‌, మ్యాక్‌ఓస్‌ ఆపరేటింగ్స్‌ సిస్టమ్స్‌లపై గూగుల్ క్రోమ్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌ హెచ్చరించింది. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో బగ్‌లు ఉన్నాయని హెచ్చరించారు. వీటిని ఉపయోగించుకుని హ్యాకర్లు అటాక్‌ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సిస్టమ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకున్న ముఖ్యమైన డేటాను, పాస్‌వర్డ్‌లను సైతం హ్యాకర్లు కొట్టేసే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ బ్రౌజర్‌ ఉపయోగించేవారు వెంటనే దాన్ని అప్డేట్ చేయాలని సంస్థ సూచించింది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయిన సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది.

కాబట్టి ఇలాంటి గ్యాడ్జెట్స్‌ ఉపయోగించే వారు కూడా క్రోమ్‌ను అప్‌డేట్‌చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఈ భద్రతా లోపం సుమారు 18 ఏళ్ల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని డెవలపర్లు గుర్తించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో పరిశోధకులు ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..