Google New Feature: గూగుల్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా యజర్లు ఎక్కువ సమయం సెర్చ్ ఇంజన్ పేజ్‌లో ఉండేలా చేయాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌లో ఉండే షార్ట్ వీడియోలను సెర్చ్ రిజల్ట్‌లో చూపించనుంది. ఇది సెర్చ్ రిజల్ట్‌లో కనిపించే వెబ్‌సైట్‌ల జాబితాపైన రొటేషన్ పద్దతిలో కనిపించేలా చేసేదుకు ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ యాప్‌లో టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో గూగుల్ డిస్కవరీలో ఇదే తరహా షార్ట్ వీడియోల ఫీచర్ ఉండేది. ప్రస్తుతం గూగుల్ తీసుకువచ్చిన షార్ట్ వీడియోలకు, రెండు నెలల కిందట గూగుల్ సెర్చ్ యాప్‌లో విడుదల చేసిన గూగుల్ స్టోరీస్‌కు ఎలాంటి పొలిక లేదని పేర్కొంది.
ఇప్పటి వరకు గూగుల్ షార్ట్ వీడియోలను కేవలం యూట్యూబ్, లాంగీ ట్రెల్‌ల నుంచి మాత్రమే తీసుకునే వారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ షార్ట్ వీడియోలు కనిపించేలా చేయనున్నారు. అయితే వీడియో పై క్లిక్ చేస్తే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రాం యాప్‌లోకి కాకుండా వెబ్ వెర్షన్ ఓపెన్ అవుతాయి. దాని వల్ల యూజర్ ఒకేసారి రెండు యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం తప్పుతుంది.
National Train Enquiry System: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది.? పూర్తి వివరాలు తెలుసుకోండిలా..!