Google Pixel Tablet: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

|

May 09, 2023 | 4:15 PM

తర్వలో నిర్వహించే గూగుల్ ఐఓ ఈవెంట్‌లో గూగుల్ ట్యాబ్ రిలీజ్ చేస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ట్యాబ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. జపాన్‌కు సంబంధించిన అమెజాన్ సైట్‌లో ఈ ట్యాబ్‌ను పొరపాటుగా లిస్ట్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఈ ట్యాబ్‌పైనే పడింది.

Google Pixel Tablet: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
Google Tablet
Follow us on

గూగుల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వినియోగదారులు ఎప్పటి నుంచో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ ట్యాబ్లెట్ విషయంలో ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తుంది. తర్వలో నిర్వహించే గూగుల్ ఐఓ ఈవెంట్‌లో గూగుల్ ట్యాబ్ రిలీజ్ చేస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ట్యాబ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. జపాన్‌కు సంబంధించిన అమెజాన్ సైట్‌లో ఈ ట్యాబ్‌ను పొరపాటుగా లిస్ట్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఈ ట్యాబ్‌పైనే పడింది. మామూలుగా అయితే ఈ ఏడాది ఈ ట్యాబ్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని అందరూ అనుకున్నా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే అమెజాన్ సంస్థ చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ ట్యాబ్ గురించి వివరాలపై నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే పొరపాటు గ్రహించిన వెంటనే అమెజాన్ ఈ ఫోన్‌ను అన్‌లిస్ట్ చేసింది. అయితే ఈ ట్యాబ్‌కు సంబంధించిన ధర ఇతర ఫీచర్లు గురించి ఓ లుక్కేద్దాం.

ఓ వినియోగదారు షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఈ గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ రూ. 48,000 ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ ట్యాబ్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. పింగాణీ, హాజెల్ వినియోగదారులను పలుకరించనుంది.. అదనంగా ఇది ఛార్జింగ్ స్పీకర్ డాక్‌తో పాటు ప్రారంభమవుతుందని సమాచారం. ఈ టాబ్లెట్ జూన్ 20 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పిక్సెల్ టాబ్లెట్ 2560×1600 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 10.95 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో రావచ్చు. ఇది 500 నిట్‌ల గరిష్ట ప్రకాశం కలిగి ఉండవచ్చు. అలాగే నాలుగు స్పీకర్లు ఉండవచ్చు. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే 27 డబ్ల్యూహెచ్ బ్యాటరీతో 12 గంటల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. అలాగే 18 వాట్స్ స్పీడ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చు. అలాగే 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. వైఫై 6ఈ, అల్ట్రావెయిడ్ బాండ్ మద్దతు, బ్లూటూత్ 5.2, 3.2 జెన్ 1 యూఎస్‌బీ టైప్ సీ  పోర్ట్‌తో రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..