Flipkart Sale: గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్‌పై రూ. 23,000 తగ్గింపు.. రెండు రోజులే అవకాశం..

6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన గూగుల్ పిక్సల్ 6ఏ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 28,999కే లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 43,999గా ఉంది. డైరెక్ట్ డిస్కౌంట్ రూ. 15,000, అంటే 34శాతం వరకూ డిస్కౌంట్ పై లభిస్తోంది.

Flipkart Sale: గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్‌పై రూ. 23,000 తగ్గింపు.. రెండు రోజులే అవకాశం..
Google Pixel 6a

Updated on: May 20, 2023 | 4:04 PM

గూగుల్ నుంచి ఇటీవలే పిక్సల్ 7ఏ ఫోన్ విడుదలైంది. గూగుల్ అందించిన బడ్జెట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. దీని ధర రూ. 43,999గా ఉంది. మరోవైపు అంతకు ముందు విడుదల చేసిన గూగుల్ పిక్సల్ 6ఏ స్మార్ట్ ఫోన్ ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది సామాన్యుని బడ్జెట్లోకి వచ్చేసింది. అది మే 19న ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ సేల్ మరింత తక్కువ ధరకే లభ్యమవుతోంది. రూ. 43,999ఉండే ఈ ఫోన్.. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ చేంజ్ పోనూ కేవలం రూ. 20,000 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ బిగ్ బచత్ సేల్ మే 21 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదొక్కటే కాక అనేక వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి.

గూగుల్ పిక్సల్ 6ఏ..

గూగుల్ పిక్సల్ ఫోన్ డ్యూయల్ టోన్ కలర్ డిజైన్, బోల్డ్ వైజర్ తో వస్తుంది. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది టెన్సర్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఉంటుంది. డ్యూయల్ 12ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. 4410ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ల చార్జింగ్ సపోర్టుతో వస్తుంది.

భారీగా తగ్గిన ధరలు..

6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన గూగుల్ పిక్సల్ 6ఏ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 28,999కే లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 43,999గా ఉంది. డైరెక్ట్ డిస్కౌంట్ రూ. 15,000, అంటే 34శాతం వరకూ డిస్కౌంట్ పై లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఆఫర్లు.. పై డిస్కౌంట్ కాక హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డు పై మరో రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. అంటే కేవలం రూ. 27,999కే ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్ ఛేంజ్ ఆఫర్.. డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కాక ఏదైనా పాత ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేస్తే దాదాపు రూర. 28,000 వరకూ తగ్గింపును పొందవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయి. అన్ని నియమ, నిబంధనలు, రిక్వైర్ మెంట్స్ ఫుల్ ఫిల్ అయితే అప్పుడు భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు. మొత్తం మీద అన్ని డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 20,000లోపుధరలోనే సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us