Google Pay: దేశంలో గూగుల్ పే యాప్ అందుబాటులో ఉండదా..? మరి ప్రత్యామ్నాయం ఏమిటి.. ఇప్పుడు తెలుసుకోండి..

|

May 14, 2022 | 6:43 PM

Google Pay: భారత డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న గూగుల్ పే తాజాగా సరికొత్త వాలెట్ సేవలను(Wallet Services) ప్రకటించింది. ఈ అప్‌డేటెడ్ గూగుల్ వాలెట్ యాప్‌ ద్వారా పలు రకాల సర్వీసులు వినియోగదారులకు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.

Google Pay: దేశంలో గూగుల్ పే యాప్ అందుబాటులో ఉండదా..? మరి ప్రత్యామ్నాయం ఏమిటి.. ఇప్పుడు తెలుసుకోండి..
Google Pay
Follow us on

Google Pay: భారత డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న గూగుల్ పే తాజాగా సరికొత్త వాలెట్ సేవలను(Wallet Services) ప్రకటించింది. ఈ అప్‌డేటెడ్ గూగుల్ వాలెట్ యాప్‌ ద్వారా పలు రకాల సర్వీసులు వినియోగదారులకు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా  క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, డిజిటల్ ఐడీలు, డాక్యుమెంట్లు.. ఇలా అనేక వాటిని కస్టమర్లు డిజిటల్ రూపంలో జాగ్రత్తపరుచుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఇలా చేయటం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడ వాటిని వినియోగించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. ఫిజికల్ వాలెట్ స్థానంలో ఈ డిజిటల్ వాలెట్ వినియోంచేందుకు అనువుగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

పలు ప్రాంతాల్లో గూగుల్ పే యాప్‌ స్థానంలో గూగుల్ వాలెట్ అందుబాటులోకి రాబోతోంది. అంటే కొన్ని దేశాల్లో గూగుల్ పే యాప్ ఇకపై కనిపించదు. గూగుల్ అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడించింది. పలు దేశాల్లో గూగుల్ పే స్థానంలో గూగుల్ వాలెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. అమెరికా, సింగపూర్, భారత్ వంటి దేశాల్లో మాత్రం గూగుల్ పే అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. మిగిలిన దేశాల్లో గూగుల్ వాలెట్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఉదాహరణకు మీరు ట్రాన్సిట్ కార్డును గూగుల్ వాలెట్‌కు యాడ్ చేసుకుంటే డైరెక్షన్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆటోమేటిక్‌గానే మీ కార్డు వివరాలను, బ్యాలెన్స్‌ను చూపిస్తుంది.

డిజిటల్ ఐడీలను స్టోర్ చేసే విషయంలో అంత సులువు కాదని తెలుస్తోంది. ఎందుకంటే వాటి విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి.  డ్రైవర్ లైసెన్స్, స్టేట్ ఐడీలు, కార్డులు, డాక్యుమెంట్లు, ఫ్లైట్ బోర్డింగ్ పాస్‌లు ఇలా చాలా వాటిని డిజిటల్ రూపంలో గూగుల్ వాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా హోటల్ కీస్, కంపెనీల బ్యాడ్జెస్ వంటి వాటికి కూడా వాలెట్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఫోన్ ద్వారా చాలా పనులు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి అనుమానం ఏమిటంటే.. గూగుల్ పే ఇక అందుబాటులో ఉండదా అనేదే. భారత్ విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. చాలా దేశాల్లో గూగుల్ రెండింటిని అందుబాటులో ఉంచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Viral Video: భారీ చేపకు ఆహారం ఇవ్వడానికి యువతి పడిన కష్టాలు.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్