Google Tricks: కొత్త ఏడాది వేళ గూగుల్‌ థ్రిల్లింగ్ ఫీచర్.. జస్ట్ 67 అని టైప్ చేస్తే మీరు షేక్ అవ్వడం పక్కా

2025వ సంవత్సరం ముగుస్తుండటటంతో గూగుల్ యూజర్లను థ్రిల్ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అదే స్క్రీన్ షేకింగ్. మీరు 67 లేదా 6-7 అనే నెంబర్లను గూగుల్ సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే స్క్రీన్ ఒక్కసారిగా షేక్ అవుతూ ఉంటుంది. మీరు చెక్ చేయాలంటే..

Google Tricks: కొత్త ఏడాది వేళ గూగుల్‌ థ్రిల్లింగ్ ఫీచర్.. జస్ట్ 67 అని టైప్ చేస్తే మీరు షేక్ అవ్వడం పక్కా
Google 67

Updated on: Dec 24, 2025 | 4:06 PM

గూగుల్‌లో చోటుచేసుకునే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అప్పుడప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ కొన్ని మ్యాజిక్‌లు చేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ మరో మ్యాజిక్ ప్రవేశపెట్టింది. మీరు గూగుల్‌ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో 67 లేదా 6-7 అని టైప్ చేసి ఒకసారి చూడండి. మీ స్క్రీన్ ఒక్కసారిగా షేక్ అవుతుంది. భూకంపం వచ్చినట్లు మీ స్క్రీన్ కొన్ని సెకన్ల పాటు షేక్ అవుతూ ఉంటుంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోకండి. గూగుల్ సరదాగా తీసుకొచ్చిన ఒక ఈస్టర్ ఎగ్ ఇది. 2025వ సంవత్సరంలో ముగుస్తున్న క్రమంలో యూజర్లను థ్రిల్ చేసేందుకు కొత్తగా తీసుకొచ్చింది.

ఇటీవల సోషల్ మీడియాలో మీరు చూస్తే 67 లేదా 6-7 అనే ట్రెండ్ వైరల్ అవుతుంది. 67 ట్రెండ్ అనేది 2024లో విడుదలైన ఫిలడెల్ఫియా రాప్ స్క్రిల్లా పాట డూట్ డూట్ (6 7) ద్వారా వచ్చింది. ఎన్బీఏ ప్లేయర్ లామెలో బాల్ (6 అడుగుల 7 అంగుళాల పొడవు) దీనికి లింక్ చేయడంతో సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అయింది. దీంతో 2025లో 67 అనేది బాగా పాపులర్ అయింది.

ఒకవేళ గూగుల్ తీసుకొచ్చిన 67 అనే షేకింగ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ మీకు నచ్చకపోతే మీరు దానిని తొలగించుకోవచ్చు. దాని కోసం బ్రౌజర్ను రీఫ్రెస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు బ్యాక్ బటన్‌ను ట్యాప్ చేసినా సరిపోతుంది. బ్యాక్ బటన్ ప్రెస్ చేసినా లేదా బ్రౌజర్‌ను రీఫ్రెస్ చేసినా మీరు స్క్రీన్ నుంచి బయటకు వస్తారు.