Google Chrome: మీరు గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగిస్తున్నారా..?అయితే తక్షణమే అప్‌డేట్‌ చేసుకోండి

Google Chrome: నేటి కాలంలో విడోస్‌, ఆండ్రాయిడ్‌ లలో గూగుల్‌ క్రోమ్‌ను ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. ఈ బ్రౌజర్‌ను అన్ని ఆండ్రాయిడ్‌ పరికరాలలో ఉంటుంది. అదే సమయంలో..

Google Chrome: మీరు గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగిస్తున్నారా..?అయితే తక్షణమే అప్‌డేట్‌ చేసుకోండి
Google Chrome

Edited By: Subhash Goud

Updated on: Jul 19, 2021 | 12:00 PM

Google Chrome: నేటి కాలంలో విడోస్‌, ఆండ్రాయిడ్‌ లలో గూగుల్‌ క్రోమ్‌ను ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. ఈ బ్రౌజర్‌ను అన్ని ఆండ్రాయిడ్‌ పరికరాలలో ఉంటుంది. అదే సమయంలో ఒపెరా, మైక్రోస్టాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి బ్రౌజర్‌లు కూడా గూగుల్‌ క్రోమియం బ్రౌజర్‌ ఇంజిన్‌పై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు దానిలో ఓ లోపం బయటపడింది. వినియోగదారులు ఈ గూగుల్‌ క్రోమ్‌ వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని గూగుల్‌ కోరుతోంది. ఎందుకంటే హ్యాకర్లు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. గూగుల్‌ క్రిమియం బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన వినియోగదారులు దీనిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపం కారణంగా హ్యాకర్లు మీ ఫోన్‌లో ఉన్న డేటాను సేకరించే అవకాశం ఉంది. అయితే తాజా వెర్షన్‌ను వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిది.

అయితే గుర్తించిన కొత్త బగ్‌ ఇప్పటికి వాడుకలో ఉందని కంపెనీ తన బ్లాగులో తెలిపింది. గూగుల్‌కు తెలియకుండానే హ్యాకర్లు డేటాను దొంగిలిస్తున్నారని తెలిపింది. అయితే బ్రౌజర్ వెర్షన్ 91.0.4472.164 ఉపయోగిస్తుంటే మీరు ఈ లోపాన్ని నివారించవచ్చు. మీరు అప్‌డేట్‌ చేసుకోకపోతే హ్యాకర్లు మీ వ్యక్తిగత వివరాలు తస్కరించే అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి:

Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌

Pegasus: దేశవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్.. జాబితాలో కేంద్రమంత్రులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు!