Sundar Pichai: గుడ్డిగా నమ్మకండి.. బుడగ ఎప్పుడైనా పేలొచ్చు.. ఏఐపై సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్య సమాచారం కోసం లేదా తమ పనిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను ప్రతీఒక్కరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ ఖచ్చితమైన సమాచారం ఇస్తుందా.. లేదా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. దీనిపై తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.

Sundar Pichai: గుడ్డిగా నమ్మకండి.. బుడగ ఎప్పుడైనా పేలొచ్చు.. ఏఐపై సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు
Sundar Pichai

Updated on: Nov 19, 2025 | 12:50 PM

Artificial intelligence sector: ఏఐ.. ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఎక్కబట్టినా దీని పేరే వినిపిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు ఏ నలుగురు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏఐతో కష్టతరమైన టాస్క్‌లు కూడా సెకన్లలో పూర్తి అవుతున్నాయి. దీంతో కంపెనీలతో పాటు ఉద్యోగులు కూడా తమ డైలీ వర్క్‌లో ఏఐను వినియోగిస్తూ వర్క్ టాస్క్‌లను సింపుల్‌గా కంప్లీట్ చేస్తున్నారు. కంపెనీలు కూడా తమ సంస్థల్లో ఏఐని వినియోగడంతో లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు.

ఏఐ వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు కూడా ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఏఐ వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని టెక్ ప్రముఖులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏఐ వాడకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని వినియోగదారులకు సూచించారు. ఏఐ ఇచ్చే ఇన్‌ఫుట్స్‌ను గుడ్డిగా నమ్మి ఫాలో అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కేవలం ఏఐపైన ఆధారపడకుండా ఇతర సమాచార వ్యవస్థలను కూడా కలిగి ఉండటం మంచిదని సూచించారు. ఏఐ టూల్స్‌ను సమర్ధవంతంగా వినియోగించడం ఎలా అనేది నేర్చుకోవాలని సుందర్ పిచాయ్ తెలిపారు.

ఖచ్చితమైన సమాచారాన్ని వినియోగదారులకు అందించేందుకు గూగుల్ జెమినీ ప్రయత్నాలు చేస్తుందని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. ఏఐ టూల్స్‌లో కొన్ని లోపాలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో పెట్టుబడుల భారీగా వస్తుండటంపై ఆయన స్పందించారు. ఏఐకు బాగా డిమాండ్ ఉందని అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారని, పెట్టుబడులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఐ బుడగ పేలితే తట్టుకునే శక్తి ఉండాలని, ఆ సత్తా గూగుల్‌కు ఉందని వెల్లడించారు. అయితే ఇతర కంపెనీలు దీనిని పూర్తిగా తట్టుకోలేకపోవచ్చని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి