Digital condom: స్మార్ట్‌ఫోన్‌లో ‘డిజిటల్‌ కండోమ్‌’.. ఎలా పని చేస్తుందో తెలుసా.?

|

Oct 28, 2024 | 5:03 PM

జర్మనీకి చెందిన ఓ కండోమ్‌ కంపెనీ మార్కెట్లోకి డిజిటల్‌ కండోమ్‌ను తీసుకొచ్చింది. ఇది ఒక యాప్‌ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ అసలు ఏంటీ డిజిటల్‌ కండోమ్‌.? దీనిని ఎలా ఉపయోగిస్తారు.? ఈ యాప్‌ ఉపయోగం ఏంటో.. లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Digital condom: స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్‌ కండోమ్‌.. ఎలా పని చేస్తుందో తెలుసా.?
Digital Condom
Follow us on

స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. అసాధ్యం అనుకున్న ఎన్నో పనులు సుసాధ్యమయ్యాయి. అయితే స్మార్ట్‌ ఫోన్‌తో లాబాలు ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది ప్రైవసీ. స్మార్ట్‌ ఫోన్స్‌తో వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడింది. మనం మాట్లాడుతోన్న మాటలు స్మార్ట్‌ ఫోన్‌ వింటుందని వాదనలు సైతం వినిపిచిన విషయం తెలిసిందే.

అయితే ప్రైవేసీకి పెద్ద పీట వేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ కండోమ్‌ బ్రాండ్‌ బిల్లీబాయ్‌.. డిజిటల్‌ కండోమ్‌ను తీసుకొచ్చింది. ఇన్నోసియన్‌ బెర్లిన్‌తో కలిసి ‘కామ్‌డోమ్‌’ (camdom) పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దీనినే డిజిట్ కండోమ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఏంటీ డిజిటల్‌ కండోమ్‌.? అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది.? దీని ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ యాప్‌ను ప్రైవసీ కోసం తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్‌ సమయాల్లో జంటల మధ్య ప్రైవసీని ఇది కాపాడుతుంది. ముఖ్యంగా వీడియోకాల్స్‌ చేసే సమయంలో ఎదుటి వ్యక్తులు రికార్డ్‌ చేసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటనలు చూసే ఉంటాం. అయితే మీ ఫోన్‌లో ఈ యాప్‌ ఉంటే ఎదుటి వ్యక్తి కాల్‌ రికార్డ్ లేదా వీడియో రికార్ చేయకుండా అడ్టుకుంటుంది. ఒకవేళ రికార్డ్‌ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది.

ఇది బ్లూటూత్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి. ఇప్పటికే ఈ యాప్‌ను 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..