Solar Smart Watch: సరికొత్త సోలార్ స్మార్ట్ వాచ్.. వావ్ అనిపించే ఫీచర్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 70 రోజులు వరకు నాన్ స్టాప్..

| Edited By: Anil kumar poka

Jan 20, 2023 | 7:19 PM

ఇదే క్రమంలో గార్మిన్ అనే సంస్థ భారతదేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ లను ఆవిష్కరించింది. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్ పేరుతో రెండు మోడళ్లు విడుదల  చేసింది. ఇది పూర్తిగా అనలాగ్ వేరియంట్ కాగా.. దీనిలో GPS మల్టీస్పోర్ట్ ఫీచర్ ఉంది.

Solar Smart Watch: సరికొత్త సోలార్ స్మార్ట్ వాచ్.. వావ్ అనిపించే ఫీచర్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 70 రోజులు వరకు నాన్ స్టాప్..
Garmin Instinct Crossover Solar
Follow us on

యువత నుంచి పెద్దల వరకూ అందరికీ ప్రస్తుతం స్మార్ట్ వాచ్ అనేది ఒక ట్రెండీ ఐటెం. ముఖ్యంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక, హెల్త్ మోనటరింగ్ తో దానిపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పలు దిగ్గజ బ్రాండ్లు కొత్త కొత్త మోడళ్లలో స్మార్ట్ వాచ్ లను ఆవిష్కరిస్తున్నాయి. మన దేశంలో కూడా వీటి వాడకం ఇటీవల కాలంలో అధికమైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్రాండ్లు కూడా భారతదేశంలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో గార్మిన్ అనే సంస్థ భారతదేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ లను ఆవిష్కరించింది. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్ పేరుతో రెండు మోడళ్లు విడుదల  చేసింది. ఇది పూర్తిగా అనలాగ్ వేరియంట్ కాగా.. దీనిలో GPS మల్టీస్పోర్ట్ ఫీచర్ ఉంది. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ మధ్య ఉన్న తేడా బ్యాటరీ లైఫ్‌. రెండో మోడల్ సోలార్ పవర్ ను వినియోగించుకొని బ్యాటరీ చార్జ్ చేసుకోగలుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

నేటి నుంచి అందుబాటులో..

గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, క్రాస్ఓవర్ సోలార్ భారతదేశంలో జనవరి 20 నుంచి అందుబాటులో ఉండనుంది. అమోజాన్, టాటా క్లిక్, టాటా లగ్జరీ, సినర్జైజర్, ఫ్లిప్ కార్ట్, నైకా డాట్ కామ్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో లభ్యం కానుంది. అలాగే గార్మిన్ బ్రాండ్ స్టోర్, హీలియోస్ వాచ్ స్టోర్, జస్ట్ ఇన్ టైమ్, క్రీడా దుకాణాలలో ఆఫ్ లైన్ లో లభ్యం అవుతుంది. భారతదేశంలో లాంచ్ అయిన గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ ధర రూ.55,990 కాగా.. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ ధర రూ.61,990గా ఆ కంపెనీ ప్రకటించింది.

అత్యాధునిక ఫీచర్లు..

సాహస యాత్రికులు ఎక్కువగా వినియోగించే ఈ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ స్మార్ట్ వాచ్ లో స్లీప్ స్కోర్, అడ్వాన్స్‌డ్ స్లీప్ మానిటరింగ్, హెల్త్ మానిటరింగ్ యాక్టివిటీలతో సహా గార్మిన్ పూర్తి వెల్‌నెస్ ఫీచర్‌లు ఉంటాయి. ఇది బాడీ బ్యాటరీ, స్ట్రెస్, హార్ట్ రేట్ వంటి కీలకమైన హెల్త్ మెట్రిక్‌లను రికార్డు చేస్తుంది. ఈ వాచ్ లోని రెవోడ్రైవ్ టెక్నాలజీ సాహస యాత్రల్లోని కఠినమైన పరిస్థితుల్లో కూడా కచ్చితమైన డేటాను అందిస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్, మల్టీ-GNSS, ABC సెన్సార్లు, ట్రాక్‌బ్యాక్ రూటింగ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

షాక్ రెసిస్టెంట్..

ఈ వాచ్ లో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా థర్మల్, షాక్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంది. స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్స్, 10 ATM (100 మీటర్లు) వాటర్ రేటింగ్‌తో వస్తుంది. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ ఒకసారి చార్జ్ చేస్తే స్మార్ట్‌వాచ్ మోడ్‌లో దాదాపు ఒక నెల వరకూ వస్తుంది. అదే జీపీఎస్ మోడ్‌లో అయితే 110 గంటల వరకు వస్తుంది. సోలార్ మోడల్ లోని స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 70 రోజుల వరకూ బ్యాటరీ వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.