ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీ, ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటాయి. అయితే ధర విషయంలో చాలా మంది వెనుకడగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్‌ను అందిస్తోంది. తక్కువ ధరకే ఏఫోన్14 ప్లస్ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 55,999కే లభిస్తోంది. దీంతో పాలు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ యూపీఐతో కొనుగోలుచేస్తే గరిష్టంగా రూ. 750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేవు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌పైస గరిష్టంగా రూ. 48,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. ఇక ఇందులో ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్‌సెట్‌ను అందించారు. ఐఓస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పోన్ పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై6, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, లైట్నింగ్ కనెక్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండు రియర్ కెమెరాలను 16 మెగాపిక్సెల్స్‌తో తీసుకొచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4323 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 26 గంటలు పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..