IPhone 15 Pro: ఆ ఐ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.10 వేల వరకూ తగ్గింపు

|

Mar 31, 2024 | 5:40 PM

ఐఫోన్ 15 ప్రో యాపిల్ నుంచి ఉత్తమమైన ఐఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ఫోన్ అత్యంత ఖరీదైనదని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోన్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐ ఫోన్ 15 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3,000 అదనపు తగ్గింపును అందిస్తోంది.

IPhone 15 Pro: ఆ ఐ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.10 వేల వరకూ తగ్గింపు
Iphone 15 Pro
Follow us on

స్మార్ట్‌ఫోన్లు ఇటీవల కాలంలో అధికంగా వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల వినియోదారులు ఇటీవల కాలంలో ఐఫోన్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఐఫోన్ 15 ప్రో యాపిల్ నుంచి ఉత్తమమైన ఐఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ఫోన్ అత్యంత ఖరీదైనదని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోన్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐ ఫోన్ 15 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. ఐ ఫోన్ 15 ప్రోపై మొత్తం  రూ.10 వేల వరకూ తగ్గింపు అందుబాటలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో పై ఆఫర్లను తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో ఫోన్ కేవలం రూ. 1,27,900 వద్ద అందుబాటులో ఉంది. ఐ ఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ ధర  సాధారణంగా రూ. 1,34,900 ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిప్‌కార్ట్‌లో రూ. 7,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,000 తగ్గింపు కూడా ఉంది. దీంతో ఈ ఫోన్ దీని ధర ప్రభావవంతంగా రూ.1,24,900కి తగ్గుతుంది. ప్రస్తుతానికి ఈ ఐఫోన్ 15 ప్రో డీల్ ఎప్పుడు ముగుస్తుందో పేర్కొనలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి నుంచి బిగ్ బచాట్ సేల్ ప్రారంభం అవుతుంది.  కాబట్టి ఈ సేల్ ఈవెంట్ ముగిసిన తర్వాత ఐఫోన్ 15 ప్రో డిస్కౌంట్ ఆఫర్ గడువు ముగిసే అవకాశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ 15ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగా పని చేస్తుంది. ఐ ఫోన్ 15 ప్రో బ్లూ కలర్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కో వేరియంట్‌కు అనుగుణంగా ఒక్కో ధరకు అందుబాటులో ఉంది. బ్లూ వెర్షన్ ధర రూ.65,999, నలుపు లేదా ఆకుపచ్చని కొనుగోలు చేసే వ్యక్తులు రూ.66,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. పింక్ మోడల్ ధర రూ.67,999గా ఉంది. బ్లూ మోడల్‌పై అదనపు బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేనప్పటికీ బ్లాక్ మోడల్ ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 1,250 తగ్గింపు అందుబాటులో ఉ:ది. గ్రీన్ వెర్షన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపుతో అమ్మకానికి ఉంది. అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 15 బేస్ మోడల్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం భారతదేశంలో రూ.79,900కు అందుబాటులో ఉంది. కాబట్టి ఆసక్తిగల కొనుగోలుదారులు ప్రామాణిక ఐ ఫోన్ 15 మోడల్‌పై ఇది చాలా మందిచ డీల్ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఐ ఫోన్ 15 ప్లస్‌ను రూ. 80,999 తగ్గింపు ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. రిలీజ్ చేసినప్పుడు ఈ ఫోన్ ధర రూ. 89,990గా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి