Hard Disk: హార్డ్‌ డిస్క్‌లపై అదిరిపోయే డిస్కౌంట్స్‌.. రూ. 5వేలలో బెస్ట్ డీల్స్‌..

|

Oct 14, 2023 | 8:30 PM

వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్స్‌లో కూడా కేవలం 500 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. మరి భారీగా డేటాను స్టోర్‌ చేసుకోవాలంటే పరిస్థితి ఏంటి.? ఇందుకోసం అందుబాటులోకి వచ్చినవే ఎక్సట్రనల్ హార్డ్‌ డిస్క్‌లు. వీటిని సింపుల్‌గా ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకొని డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు డేటాను పొందొచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా...

Hard Disk: హార్డ్‌ డిస్క్‌లపై అదిరిపోయే డిస్కౌంట్స్‌.. రూ. 5వేలలో బెస్ట్ డీల్స్‌..
External Hard Disks
Follow us on

ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. డేటా ఛార్జీలు భారీగా తగ్గడం, బ్రాడ్‌బాండ్‌ సేవలు సైతం అందరికీ అందుబాటు ధరలోకి రావడంతో హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో సహజంగానే డేటా వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. ఈ కారణంగా సహజంగానే డేటా స్టోరేజ్‌ ఇబ్బందితో కూడుకున్న అంశంగా మారింది.

వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్స్‌లో కూడా కేవలం 500 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. మరి భారీగా డేటాను స్టోర్‌ చేసుకోవాలంటే పరిస్థితి ఏంటి.? ఇందుకోసం అందుబాటులోకి వచ్చినవే ఎక్సట్రనల్ హార్డ్‌ డిస్క్‌లు. వీటిని సింపుల్‌గా ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకొని డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు డేటాను పొందొచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్‌ బిలియన్‌ డేట్స్‌ పేరుతో సేల్‌లో హార్డ్‌ డిస్క్‌లపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 5వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ ఎక్స్‌ట్రనల్‌ హార్డ్‌ డిస్క్‌లు వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

TOSHIBA Canvio Partner: తోషిబా కంపెనీకి చెందిన ఈ హార్డ్‌ డిస్క్‌ కెపాసిటీ 1టీబీ ఉంటుంది. ఈ హార్డ్‌ డిస్క్‌ అసలు ధర రూ. 6000 కాగా 39 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3,649కి సొంతం చేసుకోవచ్చు. పోర్టబుల్ హార్డ్‌ డ్రైవ్‌గా రూపొందించిన ఈ హార్డ్‌ డిస్క్‌లో యూఎస్‌బీ 3.0 కనెక్టివిటీ అందించారు. మూడేళ్లు డొమెస్టిక్‌ వారంటీ అందించనున్నారు. ఈ హార్డ్‌ డిస్క్‌ను హెచ్‌డీడీ టైప్‌గా తీసుకొచ్చారు. విండోస్‌, మాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

WD 1.5 TB: రూ. 5వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ హార్డ్‌ డిస్క్‌లో ఇదీ ఒకటి. 1.5 టీబీ కెపాసిటీతో రూపొందించిన ఈ హార్డ్‌డిస్క్‌ అసలు ధర రూ. 5,600కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 4,997కే సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీ 3.0, యూఎస్‌బీ 2.0 కనెక్టివిటీ ఫీచర్‌ దీని సొంతం. తక్కువ బరువు, స్లిమ్‌గా డిజైన్‌ చేసిన ఈ హార్డ్‌ డిస్క్‌ హెచ్‌డీడీ టైప్‌తో రూపొందించింది. విండోస్‌ 10, విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

Seagate Basic Portable STJL1000400 1 TB: ఈ హార్డ్‌ డిస్క్‌ అసలు ధర రూ. 5,899కాగా 38 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3,649కి సొంతం చేసుకునే అవకాశం కల్పించాలి. 1 టీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో వచ్చే ఈ హార్డ్ డిస్క్‌ హెచ్‌డీడీ టైప్‌తో తెచ్చారు. విండోస్‌ 10, 8, 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు ఈ హార్డ్‌డిస్క్‌ సపోర్ట్ చేస్తుంది.

ADATA 1 TB: రూ. 5వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ హార్డ్ డిస్క్‌ల్లో ఇదీ ఒకటి. 1 టీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో రూపొందించిన ఈ హార్డ్ డిస్క్‌ అసలు ధర రూ. 7,599కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 4,825కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌డీడీ టైప్‌తో రూపొందించిన ఈ హార్డ్‌ డిస్క్‌.. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది.

WD Elements 1 TB: వన్‌ టీబీ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ హార్డ్ డిస్క్‌ అసలు ధర రూ. 5,400కాగా 12 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 4,748కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌డీడీ టైప్‌తో తీసుకొచ్చిన ఈ హార్డ్‌ డిస్క్‌ విండోస్‌ 7, విండోస్‌ 8, విండోస్‌ 8.1, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..