ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లకు గిరాకీ భారీగా పెరిగింది. ఒకప్పుడు అధిక ధరలు పలికిన స్మార్ట్ వాచ్‌ల ధరలు ఇప్పుడు కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో భారీగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ ధరలోనే అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి.
తాజాగా ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ ఆర్మర్ పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూపర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫైర్ బోల్ట్ ఆర్మర్ స్మార్ట్ వాచ్‌లో 1.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను విడుదల చేస్తుంది. ఇక 400X400 ఈ స్మార్ట్ వాచ్ స్క్రీన్ సొంతం. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. ఇందుకోసం ఇన్‌బుల్ట్‌గా స్పీకర్‌ను అందించారు. ఇక ఈ వాచ్ ధర విషయానికొస్తే రూ. 1499గా నిర్ణయించారు. ఫైర్ బోల్ట్ ఆర్మర్ స్మార్ట్ వాచ్‌ను బ్లాక్, కామో బ్లాక్, గ్రీన్, గోల్డ్ బ్లాక్, సిల్వర్, గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ స్మార్ట్‌వాచ్‌లో సర్క్యులర్ డయల్‌ను అందించారు. నావిగేషన్ కోసం క్రౌన్ బట్‌ను సైడ్‌కు అందించారు. ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్‌తో నేరుగా వాచ్‌లో ఫోన్ మాట్లాడుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఫంక్షన్‌ను ఇందులో అందించారు. ఇక ఈ వాచ్‌లో హృదయ స్పందన రేటు, స్లీప్ ట్రాకింగ్, ఎస్‌పీఓ2 స్థాయి వంటి హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫైర్ బోల్ట్ ఆర్మర్ వాచ్‌లో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందించారు. స్మార్ట్ నోటిఫికేషన్, వెదర్ ఇన్ఫర్మేషన్, కాలిక్యులేటర్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ వాచ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 8 రోజులు పని చేస్తుంది. స్టాండ్‌బైలో 25 రోజులు పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..