Facebook vs Apple: యాపిల్ కొత్త ఫీచర్‌తో భారీగా దెబ్బతిన్న ఫేస్‌బుక్‌.. 80 శాతం తగ్గిన ట్రాఫిక్.. ముదురుతోన్న వివాదం..!

Apple iOS14: యాపిల్ ఇటీవల ప్రారంభించిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ iOS14 అప్‌డేట్ విషయంలో ఫేస్‌బుక్ వర్సెస్ ఆపిల్ కంపెనీల మధ్య వైరం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

Facebook vs Apple: యాపిల్ కొత్త ఫీచర్‌తో భారీగా దెబ్బతిన్న ఫేస్‌బుక్‌.. 80 శాతం తగ్గిన ట్రాఫిక్.. ముదురుతోన్న వివాదం..!
Facebook New Feature

Updated on: Oct 25, 2021 | 4:40 PM

Facebook vs Apple: యాపిల్ ఇటీవల ప్రారంభించిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ iOS14 అప్‌డేట్ విషయంలో ఫేస్‌బుక్ వర్సెస్ ఆపిల్ కంపెనీల మధ్య వైరం చిలికి చిలికి గాలివాన మారింది. యాపిల్ కొత్త అప్‌డేట్ తన ప్లాట్‌ఫామ్‌లో చేసిన ప్రకటనలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫేస్‌బుక్ కంపెనీ ఆపిల్‌పై ఆరోపణలు గుప్పించింది. యాపిల్ ప్లాట్‌ఫారమ్‌లోని పిక్సెల్ టూల్ సహాయంతో, వినియోగదారుల బ్రౌజింగ్ చరిత్ర, శోధించిన ఉత్పత్తుల మేరకు ఫేస్‌బుక్ ప్రేక్షకులకు అనుగుణంగా ప్రకటనలను చూపుతుంది. iOS14 అప్‌డేట్ రావడంతో ఫేస్‌బుక్ ఈ పనిని చేయలేకపోయింది. దీంతో ప్రకటనల ద్వారా ఆదాయాన్ని చాలా కోల్పోయింది.

యాపిల్ వ్యవస్థాపకుడు టిమ్ కుక్ iOS14లో ఐడెంటిఫైయర్ ఫర్ అడ్వర్టైజర్ (IDFA) ఫీచర్‌ను అప్‌డేట్ చేశారు. ఈ ఫీచర్ ప్రకటనకర్తలను గుర్తిస్తుంది. వినియోగదారులు కోరుకున్నట్లయితే వారిని శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశం ఉంది. దీని కారణంగా ఐఫోన్‌లో ఫేస్‌బుక్ యూజర్లకు అనుగుణంగా ప్రకటనను అందించలేకపోతోంది.

IDFA ప్రకటనల సంస్థ ట్రాకింగ్ సమాచారాన్ని అందిస్తుంది..
ఫేస్‌బుక్ (Facebook) తన బ్లాగ్‌లో సంబంధిత అప్లికేషన్‌లు మాత్రమే యాపిల్ యాప్ స్టోర్‌లో అనుమతి పొందుతాయని పేర్కొంది. అయితే iOS 14 వినియోగదారులకు ప్రకటనల కంపెనీల ట్రాకింగ్ గురించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ నియమాలను అమలు చేయని యాప్‌లు యాపిల్ ప్లేస్టోర్‌లో ఉండవు. దీంతో పాటు, ఆపిల్ పాలసీ నిర్దిష్ట డేటాను తీసుకోవడాన్ని కూడా నిషేధించింది.

ఫేస్‌బుక్ త్వరలో పిక్సెల్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది వినియోగదారుల గోప్యతను దృష్టిలో ఉంచుకుని పలు మార్పులు చేయనున్నట్లు సమాచారం.

ఒకేసారి క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొంతమంది వినియోగదారులు iOS 14.5లో చేసిన మార్పులను ఇష్టపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ పండుగల సీజన్‌లో తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఫేస్‌బుక్‌పై ఆధారపడే ప్రకటనదారులు ఈ ఫీచర్‌తో నిరాశకు గురయ్యారు. దీంతో ఒక ప్రకటనపై క్లిక్ చేయడం ద్వారా ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఫేస్‌బుక్ ప్రొడక్ట్ పేజీ ట్రాఫిక్‌ 80 శాతం డౌన్..
ఫేస్‌బుక్ పనితీరుపై విక్రయదారుడు ఆరోన్ పాల్ సీఎన్‌బీసీతో మాట్లాడుతూ.. కంపెనీ బడ్జెట్ నిరంతరం మారుతూ ఉంటుంది. పాల్‌కు చెందిన కారౌసెల్ కంపెనీ ఫేస్‌బుక్‌లో రోజుకు మిలియన్ డాలర్లు ఖర్చు చేసేది. కానీ, ఇప్పుడు అది తగ్గింది. IOS లో మార్పుకు ముందు, ఫేస్‌బుక్‌లో 80 శాతం ట్రాఫిక్ దాని ప్రొడక్ట్ పేజీకి మరలేది. ప్రస్తుతం 20 శాతం మాత్రంగానే ఉంది. పండుగల సీజన్‌లో కూడా ఫేస్‌బుక్ ప్రకటనల వ్యాపారం నిరంతరం క్షీణిస్తోంది.

ఫేస్‌బుక్ షేర్ ధరపై ప్రభావం..
దీంతో ఫేస్‌బుక్ షేరు ధరపై కూడా ప్రభావం పడింది. ఈ అప్‌డేట్ స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, అలాగే ఫేస్‌బుక్‌తో సహా ఈమెయిల్‌లను కూడా ప్రభావితం చేస్తుందని పాల్ తెలిపాడు. ఏప్రిల్ 26న iOS14 ప్రారంభించబడినప్పుడు, ఫేస్‌బుక్ షేర్ ధర $303గా ఉంది. సెప్టెంబర్ 14 న ఐఫోన్ లాంచ్ అయినప్పుడు అది $ 376 వద్ద ఉంది. ప్రస్తుతం $ 324గా నమోదైంది. మరి ముందుముందు ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.

Also Read: Plastic particles: ఆవుల శరీరాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు.. మానవులకు చేరితే ప్రమాదం తప్పదట!

Immortal Jelley Fish: నిజంగా ఈ జీవికి మరణం లేదు.. జీవితం మీద విరక్తి కలిగే వరకూ బతికే అవకాశం ఉన్న ఏకైక జీవి ఇదే!