బాంబు పేల్చిన ఫేస్‌బుక్.. మీ పాస్‌వర్డ్స్ మా ఉద్యోగులకు తెలుసు

ఫేస్‌బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. మరో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఫేస్‌బుక్ తాజాగా ప్రకటించింది. కోట్లాది మంది ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు కనిపిస్తుంటాయని, ఇంటర్నల్ సర్వర్లలో వాటిని దాచామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫేస్‌బుక్‌కు చెందిన మిలియన్ యూజర్ల డేటాకు భద్రత లేకుండా పోయింది. యూజర్ల పాస్‌వర్డ్స్ అన్నీ టెక్ట్స్ ఫార్మాట్‌లో తమ ఇంటర్నల్ సర్వర్స్‌లో స్టోర్ అయ్యాయని.. అవి తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని […]

బాంబు పేల్చిన ఫేస్‌బుక్.. మీ పాస్‌వర్డ్స్ మా ఉద్యోగులకు తెలుసు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2019 | 7:11 PM

ఫేస్‌బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. మరో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఫేస్‌బుక్ తాజాగా ప్రకటించింది. కోట్లాది మంది ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు కనిపిస్తుంటాయని, ఇంటర్నల్ సర్వర్లలో వాటిని దాచామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫేస్‌బుక్‌కు చెందిన మిలియన్ యూజర్ల డేటాకు భద్రత లేకుండా పోయింది. యూజర్ల పాస్‌వర్డ్స్ అన్నీ టెక్ట్స్ ఫార్మాట్‌లో తమ ఇంటర్నల్ సర్వర్స్‌లో స్టోర్ అయ్యాయని.. అవి తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఫేస్‌బుక్ పాస్‌వర్డ్స్ అన్నీ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. జనవరిలో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఈ సమస్య ఎదురైనట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే.. పాస్‌వర్డ్స్ కంపెనీలోనే లీక్ అవడం వల్ల యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కంపెనీ వాటిని మిస్‌యూజ్ చేయదని తెలిపింది.

మిలియన్ యూజర్ల డేటా లీక్ అవడంతో యూజర్లంతా మరోసారి పాస్‌వర్డ్ మార్చుకుంటే బెటర్ అని ఫేస్‌బుక్ సూచించింది. ఎక్కువగా ఫేస్‌బుక్ లైట్ యూజర్స్ ఆతర్వాత ఫేస్‌బుక్ యూజర్స్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ డేటా లీక్ అయినట్లు తెలిపింది. అందులోనూ ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయ్యే ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ డేటా మాత్రమే లీక్ అయిందని వెల్లడించింది. కాగా, ఫేస్ బుక్ పాస్ వర్డ్ ల విషయమై ‘క్రెబ్స్‌ ఆన్‌ సెక్యూరిటీ డాట్ కామ్‌’ అనే సెక్యూరిటీ న్యూస్‌ వెబ్‌ సైట్‌ గతంలోనే కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల మంది పాస్ వర్డ్ లు సాధారణ అక్షరాల్లో ఉన్నాయని, వీటిని సుమారు 20 వేల మంది ఉద్యోగులు చూస్తున్నారని సంస్థ తెలిపింది. ఇప్పటికే డేటా భద్రతపై అందోళన వెల్లువెత్తుతున్న వేళ, పాస్ వర్డ్ లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్ లో సర్వర్లలో దాచామని, అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు మండిపడుతున్నారు.

Latest Articles
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం