
టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనాత్మక ఒప్పందం చోటుచేసుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, ప్రముఖ ఏఐ కోడింగ్ స్టార్టప్ ఎనిస్పియర్ అభివృద్ధి చేసిన ‘కర్సర్’ (Cursor)ను 60 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ 2026 సంవత్సరంలో అత్యంత విలువైన టెక్ కొనుగోళ్లలో ఒకటిగా నిలిచే అవకాశముంది. కర్సర్ అనేది సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన ప్రముఖ ఏఐ కోడింగ్ అసిస్టెంట్. కోడ్ రాయడం, సవరించడం, డీబగ్ చేయడం వంటి పనులను వేగవంతం చేయడంలో ఇది సహాయపడుతుంది.
2022లో స్థాపించబడిన ఈ సంస్థ కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డెవలపర్లను ఆకర్షించింది. సంస్థ వార్షిక ఆదాయం కూడా వేగంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే స్పేస్‌ఎక్స్, కర్సర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయి కొనుగోలుగా మార్చాలని స్పేస్‌ఎక్స్ నిర్ణయించింది. ఈ కొనుగోలు ద్వారా మస్క్‌కు చెందిన ఏఐ సంస్థ xAIకి కోడింగ్ ఏఐ మార్కెట్‌లో మరింత బలం చేకూరనుంది. ముఖ్యంగా OpenAI, Anthropic, గూగుల్ వంటి సంస్థలకు పోటీగా నిలవడంలో ఈ డీల్ కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాకెట్ టెక్నాలజీ, ఉపగ్రహ వ్యవస్థలు, ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి రంగాల్లో కర్సర్ టెక్నాలజీని వినియోగించాలని స్పేస్‌ఎక్స్ యోచిస్తోంది. భారీ కంప్యూటింగ్ సామర్థ్యాలను కర్సర్‌కు అందించడం ద్వారా మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయాలన్నది సంస్థ లక్ష్యంగా ఉంది. ఈ ఒప్పందం 2026 మూడో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి