Earth from Space: మనకి భూమి మీద నుంచి చూస్తే, ఆకాశం.. చందమామ..సూర్యుడు.. నక్షత్రాలు అప్పుడప్పుడు ఉల్కలు ఇలా ఎన్నో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకాశం వెనుక ఏముంటుంది. సూర్యుడు..చంద్రుడు.. నక్షత్రాలు ఇవన్నీ ఇంత అందంగా కనిపిస్తున్నాయి కదా.. మరి ఆకాశం నుంచి చూస్తే భూమి ఎలా కనిపిస్తుంది? ఇంకా పైకి వెళ్లి అంతరిక్షం నుంచి చూస్తే మన భూమండలం అందంగా కనిపిస్తుందా? మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా.. మరి ఆ సూర్యుని వెలుగులు అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తాయా? అబ్బ ఎన్ని ప్రశ్నలో! అయితే, వీటి సమాధానాలు స్వయంగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రత్యేకంగా అంతరిక్ష పరిశోధనలు చేసేవారికి తప్ప. ఇన్ని ప్రశ్నలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా వారికీ వుంటాయి. అందుకే, వారికి మన ఉత్సుకత తెలుసు. భూమి పై ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వారు అర్ధం చేసుకుంటారు. దీనికోసం వారు తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనతో పంచుకుంటారు. అందులోనూ.. అందమైన భూమికి సంబంధించిన విశేషాలతో ఉన్న ఫోటోలు ఎప్పటికప్పుడు మనకి అందిస్తుంటారు పరిశోధకులు.
తాజాగా అటువంటి ఫోటోలు కొన్ని విడుదల చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్) లో ఉన్న వ్యోమగాములు తీసిన ఫోటోలు ఇవి. వీటిని చూస్తే వావ్ అనిపించక మానదు. ఎందుకంటే.. భూమిని ముద్దాడుతున్న తొలి సూర్యకిరణాలు.. చీకటిలో కృత్రిమ వెలుగులతో మెరిసిపోతున్న భూమిలోని కొన్ని ప్రాంతాలు ఇలా అద్భుతమైన ఫోటోలు ఈ వ్యోమగాములు తీశారు. వీటిని చూస్తే మనసులో ఉన్న కొన్ని సందేహాలు తొలిగిపోతాయి. వీటిలో భారత దేశంలోని ఫోటోలు ఉన్నాయి. మారిషస్, రీ యూనియన్ దీవులు ఈ ఫోటోలలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ఆగ్నేయ తీరంలోని టాస్మాన్ సముద్రంపై పడుతున్న సూర్యకిరణాలు ఈ ఫోటోలలో అద్భుతంగా బంధించారు. ఇక ఇటలీలోని రాత్రి కాంతి దృశ్యాలు మన కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇప్పటివరకు, ఈ చిత్రాలను 2.5 లక్షలకు పైగా ప్రజలు లైక్ చేశారు. ఒక ఇటాలియన్ యూజర్ తన నేపుల్స్ నగరాన్ని కూడా ఆ ఫోటోలలో కనిపెట్టారు. ట్రావెల్ ఫోటోగ్రాఫర్, జాబ్ పింగ్‌గార్డ్ ఈ ఫోటోల గురించి ఇలా కామెంట్ చేశారు. ”అన్ని దేశాలను ఈ విధంగా చూడటం గొప్ప అనుభవం. అంతరిక్షం నుండి భూమిని చూడటం ఎల్లప్పుడూ చాలా ఉత్తేజకరమైనది.”
అంతరిక్షం నుంచి పంచుకున్న ఆ ఫోటోలను మీరూ ఇక్కడ చూడొచ్చు..
Also Read: Big Bang: విశ్వం పుట్టుక గురించి సరికొత్త విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
Life beyond Earth: జూపిటర్ ఉపగ్రహం యూరోపా సముద్రాలలో అగ్నిపర్వతాలు.. నాసా పరిశోధనలో వెల్లడి!