Realme earbuds: రియల్ మీ నుంచి AI ఇయర్ బడ్స్.. అతి తక్కువ ధరకే..

రియల్ మీ అతి తక్కువ ధరకే బెస్ట్ క్వాలిటీ ఇయర్ బడ్స్‌ను త్వరలో మార్కెట్‌లోకి లాంచ్ చేయనుంది. ఇందులో నాయిస్ క్యాన్సలేషన్పా టు ఏఐ ట్రాన్సలేషన్ ఫీచర్ ఉంది. అలాగే వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా అనేక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

Realme earbuds: రియల్ మీ నుంచి AI ఇయర్ బడ్స్.. అతి తక్కువ ధరకే..
Real Me Earbuds

Updated on: Nov 20, 2025 | 1:10 PM

Realme Buds Clip: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ యూజర్లకు మెరుగైన అనుభూతి అందించేందుకు రకరకాల ఫీచర్లతో మొబైల్స్‌తో పాటు రకరకాల పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. త్వరలో కొత్త ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. బడ్స్ క్లిప్ ఓపెన్ ఇయర్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ పేరుతో వీటిని లాంచ్ చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో వీటిని డిస్‌ప్లే చేస్తోంది. రియల్ మీ తెస్తున్న ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లు ఏంటి? ఇందులో ప్రత్యేకంగా ఎలాంటి కొత్త టెక్నాలజీ జోడించారు? వీటి ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్ మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఒకటి టైటానియం బ్లాక్ కాగా.. రెండోది టైటానియం గోల్డ్. వీటి ధర రూ.5,315గా తెలుస్తోంది. ఇందులో11mm డ్యూయల్-మాగ్నెట్ స్పీకర్ యూనిట్‌ ఉంటుందని Realme పేర్కొంది. కాల్ మాట్లేడే సమయంలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ కొత్త ఇయర్ బడ్స్‌లో ఏఐ ఆధారిత టెక్నాలజీతో నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ తెస్తోంది. దీని ద్వారా మీరు ట్రాఫిక్ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫోన్లు మాట్లాడుకోవచ్చు. ఇక ఇందులో ఏఐ ట్రాన్సలేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇది వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

ఇక ఈ ఇయర్ బడ్స్‌ బ్యాటరీ పరంగా హైలెట్ అని చెప్పవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఛార్జింగ్ కేస్‌తో జత చేసినప్పుడు వినియోగ సమయం 36 గంటల వరకు చేరుకుంటుందని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఛార్జింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇందులో రింగ్ స్ట్రైల్ ఎల్‌ఈడీ సిగ్నల్ ఉంటుంది. ఈ ఇయర్ బడ్‌లు IP55 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. దీని వల్ల దుమ్ము, నీటి నుంచి రక్షణ ఉంటుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి