knowledge: మీకు తెలుసా.? విమానంలోకి థర్మామీటర్‌ను అనుమతించరు.. కారణమేంటంటే..

|

Jan 03, 2023 | 8:42 PM

విమాన ప్రయాణం కేవలం ఖర్చుతోనే కాదు ఎన్నో జాగ్రత్తలతో కూడుకున్నది. విమానం టేకాఫ్‌ అయిన సమయం నుంచి ల్యాండ్‌ అయ్యే వరకు ప్రతీ క్షణం అంత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఫ్లైట్‌లో ఉండే ఉద్యోగుల నుంచి భూమి పై నుంచి ఫ్లైట్‌ను కంట్రోల్‌ చేసే వ్యవస్థ వరకు అందరూ అప్రమత్తంగా ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది...

knowledge: మీకు తెలుసా.? విమానంలోకి థర్మామీటర్‌ను అనుమతించరు.. కారణమేంటంటే..
Follow us on

విమాన ప్రయాణం కేవలం ఖర్చుతోనే కాదు ఎన్నో జాగ్రత్తలతో కూడుకున్నది. విమానం టేకాఫ్‌ అయిన సమయం నుంచి ల్యాండ్‌ అయ్యే వరకు ప్రతీ క్షణం అంత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఫ్లైట్‌లో ఉండే ఉద్యోగుల నుంచి భూమి పై నుంచి ఫ్లైట్‌ను కంట్రోల్‌ చేసే వ్యవస్థ వరకు అందరూ అప్రమత్తంగా ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇందులో భాగంగానే విమానంలో ట్రావెల్‌ చేసే వారికి కూడా ఎన్నో రకాల నియమ నిబంధనలు ఉంటాయి. ఎయిర్‌ పోర్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే ప్రయాణికులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.

ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్‌లోకి అనుమతిచ్చరు. అలాంటి వాటిలో థర్మా మీటర్‌ కూడా ఒకటి. అదేంటి థర్మామీటర్‌తో విమానంలో ప్రయణిస్తే జరిగే నష్టం ఏంటనేగా మీ సందేహం. దీనికి ఒక బలమైన కారణం ఉంది. థర్మామీటర్‌లో ఉండే పాదరసమే వీటిని విమానంలోకి అనుమతించకపోవడానికి కారణం. పాదరసం అల్యూమినియంను దెబ్బతీస్తుంది. సాధారణంగా విమానాల తయారీలో అల్యూమినియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఒకవేళ పొరపాటున విమానంలో థర్మామీటర్ పగిలిపోతే. అందులో ఉండే కొద్దిపాటి పాదరసం కూడా విమానాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. పాదరసం అల్యూమినియం బాడీపై పడితే డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. థర్మామీటర్‌ను విమానంలోకి అనుమతించారు. మరి విమానాల్లో ఫీవర్‌ వస్తే ఎలా చెకింగ్‌ చేస్తారనే సందేహం సహజంగానే వస్తుంది. ఇందుకోసం డిజిటల్ థర్మామీటర్లను ఉపయోగిస్తారు. కరోనా తర్వాత గన్‌ థర్మమీటర్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..