Most Hacked Passwords:పాస్‌వర్డ్స్ కింద వీటిని పెట్టుకున్నారా? ఇక అంతే మీ జేబు గుల్లే..!

|

Jun 22, 2023 | 5:15 PM

గతంలో మన దగ్గర సొమ్మును దోచుకోవడానికి వచ్చే బందిపోటు దొంగల్లా ప్రస్తుతం మన బ్యాంకుల్లోని సొమ్మును తస్కరించడానికి సైబర్ దొంగలు కూడా రెడీ అయ్యారు. బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వ్యక్తిగత ఖాతాల మన డేటా తస్కరించేందుకు సైబర్ ముఠాలు ప్రయత్నిస్తూ ఉంటాయి.

Most Hacked Passwords:పాస్‌వర్డ్స్ కింద వీటిని పెట్టుకున్నారా? ఇక అంతే మీ జేబు గుల్లే..!
Password
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ పరంగా గణనీయమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా మనం ఎక్కడి నుంచైనా సొమ్ము విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండడంతో అందరూ సొమ్మును బ్యాంకు అకౌంట్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. గతంలో మన దగ్గర సొమ్మును దోచుకోవడానికి వచ్చే బందిపోటు దొంగల్లా ప్రస్తుతం మన బ్యాంకుల్లోని సొమ్మును తస్కరించడానికి సైబర్ దొంగలు కూడా రెడీ అయ్యారు. బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వ్యక్తిగత ఖాతాల మన డేటా తస్కరించేందుకు సైబర్ ముఠాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ముందుగా వీరి ఆటలు సాగాలంటే మన అకౌంట్ పాస్‌వర్డ్స్ అనేవి వారికి తెలియాలి. కాబట్టి మనం ఎక్కువగా ఎలాంటి పాస్‌వర్డ్స్ పెడతామో? తెలుసుకుని వాటి ద్వారా మన డేటా చోరీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ప్రముఖ చెల్లింపు సంస్థ డోజో ‘అత్యంత హ్యాక్ చేసిన పాస్‌వర్డ్‌ల జాబితా 2023ను ఇటీవల విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా హ్యాక్ చేసిన పాస్‌వర్డ్‌ల గురించి తెలియజేస్తుంది ఇది ఆన్‌లైన్ వినియోగదారులకు వారి పాస్‌వర్డ్‌లలో వారు నివారించాల్సిన సబ్జెక్ట్‌లు, నమూనాల గురించి చెబుతుంది. ఫలితంగా, కంపెనీ అత్యంత సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లు, వాటి సగటు పొడవు, భారీ సంఖ్యలో హక్స్‌లో కనిపించిన అత్యంత ప్రజాదరణ పొందిన విషయాలను వెలికితీసింది. పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ప్రమాదకరమని ఇది రంగులు, పేర్లు, వర్గాలు, మరిన్నింటిని కూడా వెల్లడిస్తుంది. సాధారణంగా హ్యాక్ చేయబడిన పాస్‌వర్డ్‌ల జాబితాలో ప్రతి వర్గంలోని నిబంధనలు/పదాలు ఎన్నిసార్లు చేర్చబడ్డాయి అనేదానిపై జాబితా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి పదాలు పెట్టుకోకూడదో కూడా కంపెనీ సూచనలు చేసింది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • మనల్ని ఇంట్లో పిలిచే ముద్దు పేర్లు లేదా మారుపేర్లతో పాస్ వర్డ్స్ సెట్ చేసుకోవడం అత్యంత ప్రమాదకరం
  • టీవీ షోలోని పాత్రలు లేదా సీరియల్స్ లోని పాత్రలతో పాటు టీవీ షో పేర్లను పాస్‌వర్ట్స్ కింద పెట్టకూడదు. 
  • ముఖ్యంగా పాస్‌వర్డ్స్ చాలా మంది ఇష్టమైన రంగులు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పెట్టకోకూడదని గమనించాలి. 
  • అలాగే మీరు రెగ్యులర్ వాడే ఫ్యాషన్ సంబంధిత బ్రాండ్లతో పాటు కార్ల బ్రాండ్లను మీ పాస్‌వర్డ్‌లలో ఉపయోగించకండి. ఎందుకంటే హ్యాకర్లు వాటిని సులభంగా హ్యాక్ చేస్తారు.
  • నగరాలు, దేశాల పేర్లను పాస్‌వర్డ్స్‌లో వినియోగించకపోవడం ఉత్తమం. సినిమా పేర్లతో పాస్ వర్డ్‌లను పెట్టుకోకూడదు. 
  • శరీర భాగాలు, పెంపుడు జంతువల పేర్లు పెట్టుకోకూడదు. 
  • వీడియో గేమ్ అక్షరాలు, సంగీత కళాకారుల పేర్లు. వీడియో గేమ్‌ల పేర్లు పెట్టుకోకూడదు. 
  • మేకప్ బ్రాండ్ల పేర్లు, క్రీడల పేర్లు, కల్పిత పాత్రలు అంటే షెర్లాక్ హోమ్స్, ఆర్చీ, శక్తిమాన్ వంటి పేర్లకు దూరంగా ఉండాలి
  • ముఖ్యంగా సూపర్ హీరోలు అంటే ఐరన్‌మ్యాన్, బాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, ఇతర సూపర్‌హీరోలు కూడా పాస్‌వర్డ్‌ల కోసం ఉపయోగించకూడదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..