Death Mystery: మరణం అంచులో ఉన్నపుడు.. చివరి 30 సెకన్లలో ఏం జరుగుతుందో తెలుసా?

|

Feb 25, 2022 | 9:25 PM

మరణానికి కొన్ని సెకన్ల ముందు ఒక వ్యక్తి ఎలా భావిస్తాడు? జీవితానికి, మరణానికి మధ్య చివరి క్షణాలు ఎలా ఉంటాయనే దానిపై కొన్నాళ్లుగా శాస్త్రవేత్తలు విపరీతంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.

Death Mystery: మరణం అంచులో ఉన్నపుడు.. చివరి 30 సెకన్లలో ఏం జరుగుతుందో తెలుసా?
Death Mystery
Follow us on

Death Mystery: మరణానికి కొన్ని సెకన్ల ముందు ఒక వ్యక్తి ఎలా భావిస్తాడు? జీవితానికి, మరణానికి మధ్య చివరి క్షణాలు ఎలా ఉంటాయనే దానిపై కొన్నాళ్లుగా శాస్త్రవేత్తలు విపరీతంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ అశంపై ఇటీవల, యుఎస్‌లోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. మరణానికి 30 సెకన్ల ముందు, మెదడులో ప్రకాశవంతమైన కాంతి మెరుస్తున్నట్లు వారు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు దీనికి ‘లాస్ట్ రీకాల్’ అని పేరు పెట్టారు. అంటే జీవితంలోని చివరి జ్ఞాపకం. అనేక హాలీవుడ్ సైన్స్(Science) చిత్రాలలో, శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడం కనిపిస్తుంది. అయితే, అది ఫిక్షన్ గా కొట్టి పాడేసేవారు. కానీ తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆ ఫిక్షన్ నిజం అయినట్టుగా చూపిస్తున్నాయి.

87 ఏళ్ల వృద్ధుడిపై అధ్యయనం..

frontiers science News లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఇటీవల, వైద్యులు 87 ఏళ్ల వృద్ధుడి మెదడును స్కాన్ చేశారు. ఈ వ్యక్తి గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మెదడును స్కాన్ చేసినప్పుడు, అతని మరణానికి 30 సెకన్ల ముందు, అతని మెదడులో ప్రకాశవంతమైన కాంతి మెరుస్తున్నట్లు కనుగొన్నారు. దానిని ఆ వ్యక్తి కూడా చూశాడు. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఈ మార్పులు కొనసాగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

లూయిస్ విల్లే యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అజ్మల్ గెమర్ మాట్లాడుతూ.. మనిషి మెదడు చాలా క్లిష్టంగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధన న్యూరోసైన్స్ రంగంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మెదడు పనితీరును అర్థం చేసుకోవడం వల్ల రోగులకు చికిత్స చేసే కొత్త మార్గాలను కనుగొనవచ్చు.

ఈ పరిశోధన గురించి సక్సెస్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అనిల్ సేథ్ మాట్లాడుతూ ఈ డేటా చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. దీని ద్వారా తొలిసారిగా మరణానికి కొద్ది సెకన్ల ముందు మెదడులో ఏం జరుగుతోందనే విషయం తెలిసింది. గత దశాబ్ద కాలంగా, మరణానికి ముందు మెదడులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

పరిశోధనలో నిమగ్నమైన డాక్టర్ గెమర్ ప్రకారం, మరణానికి ముందు మెదడులో కాంతి మెరుస్తూ ఉండటానికి కారణం ఆల్ఫా,గామా తరంగాలు. రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత కొన్ని సెకన్ల పాటు ఈ తరంగాలు చురుకుగా ఉంటాయి. ఈ దిశగా ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.

Also Read: Hyderabad: భాగ్యనగరంలో ఆ మూడు రోజులు ఇంటింటికి బూస్టర్ డోసు బంద్.. ఎందుకంటే..

Booster Dose: బూస్టర్‌ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి