Danger App: ఈ యాప్ చాలా డేంజర్ గురూ.. మీ ఫోన్లో ఉందేమో చూసుకోండి..

|

Jul 08, 2024 | 3:41 PM

ప్రభుత్వం సైబర్ క్రైం విభాగమైన సైబర్ దోస్త్ ఈ ప్రమాదకర యాప్ ను గుర్తించింది. దీనిపై ఎక్స్ లో పోస్ట్ కూడా చేసింది. దాని ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ప్రమాదకర యాప్ ను వెంటనే ఫోన్ల నుంచి తొలగించుకోవాలని కోరింది. విదేశాలలోని మన శత్రువులతో యాప్ కు సంబంధాలు ఉన్నట్టు వెల్లడించింది.

Danger App: ఈ యాప్ చాలా డేంజర్ గురూ.. మీ ఫోన్లో ఉందేమో చూసుకోండి..
Dangerous App
Follow us on

స్మార్ట్ ఫోన్లలో యాప్ లను ఉపయోగించి మనం అనేక లావాదేవీలు నిర్వహిస్తాం. పనులు సులువుగా, సౌకర్యంగా పూర్తి కావడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. చదువు, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకులు, రుణాలు ఇచ్చే సంస్థలు ఇలా.. మన అవసరాలకు ఉపయోగపడే అనేక యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటాం. అయితే అన్ని యాప్ లూ సురక్షితం కాదు. కొన్నింటి వల్ల అనేక నష్టాలు కలుగుతాయి.

ప్రమాదకర యాప్..

ఇటీవల ఆన్ లైన్ లో రుణాలు ఇచ్చే సంస్థలు పెరిగిపోయాయి. వాటికి సంబంధించిన వివిధ యాప్ లు మనకు దర్శనమిస్తున్నాయి. చాలామంది రుణాల కోసం వాటిని డౌన్ లోడ్ చేసుకొంటున్నారు. అయితే సైబర్ దోస్త్ అనే సెక్యూరిటీ సంస్థ ఓ హెచ్చరిక జారీ చేసింది. క్యాష్ ఎక్స్ పాండ్-యు ఫైనాన్స్ అసిస్టెంట్ (cash expand-u finance assistant) అనే యాప్ కు విదేశాలలోని శత్రువులతో సంబంధం ఉన్నట్టు గుర్తించింది. దేశంలోని వినియోగదారులు ఆ యాప్ ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే అన్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత దానితో అనుబంధించబడిన మొత్తం డేటాను పరికరాల నుండి తొలగించాలని సూచించింది. ఈ ప్రమాదకర యాప్ ను ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు.

సైబర్ దోస్త్ హెచ్చరిక..

ప్రభుత్వం సైబర్ క్రైం విభాగమైన సైబర్ దోస్త్ ఈ ప్రమాదకర యాప్ ను గుర్తించింది. దీనిపై ఎక్స్ లో పోస్ట్ కూడా చేసింది. దాని ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ప్రమాదకర యాప్ ను వెంటనే ఫోన్ల నుంచి తొలగించుకోవాలని కోరింది. విదేశాలలోని మన శత్రువులతో యాప్ కు సంబంధాలు ఉన్నట్టు వెల్లడించింది.

లక్షమందికి పైగా డౌన్ లోడ్..

అయితే ఇప్పటికే ఈ యాప్ ను దేశంలో ఒక లక్ష మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీనిని 4.4 రేటింగ్, 7.19 K సమీక్షలు ఉండడం గమనార్హం. ఈ ప్రమాదకర యాప్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ప్రజలను నమ్మిస్తారు. దానికి కోసం మన వ్యక్తిగత, గుర్తింపు వివరాలను అడుగుతారు. అవి విదేశాలలోని శత్రువులకు చేతికి చిక్కితే లేనిపోని అనర్థాలు జరుగుతాయి. సైబర్ దోస్త్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాలపై పూర్తిస్థాయిలో చెప్పలేదు. కానీ యూజర్లు వెంటనే యాప్ ను తొలగించుకోవాలని ఆదేశించింది.

యూజర్లు ఏమి చేయాలంటే..

  • క్యాష్ ఎక్స్ పాండ్-యు ఫైనాన్స్ అసిస్టెంట్ లోన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న స్మార్ట్ ఫోన్లు యూజర్లందరూ వెంటనే దానిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
  • ముందుగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి. ఆ తర్వాత ఆ యాప్ పై నొక్కండి.
  • తదుపరి పేజీలో స్క్రీన్ దిగువన ఉన్న అన్‌ ఇన్‌స్టాల్ బటన్‌ ను ప్రెస్ చేయండి.
  • వెంటనే యాప్ మీ ఫోన్ నుంచి అన్‌ఇన్‌స్టాల్ అయిపోతుంది.
  • గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే మీ ఫోన్ నుంచి యాప్‌ ను అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు దానితో అనుబంధించబడిన ఖాతా, డేటాను తప్పనిసరిగా డిలీట్ చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..