మా దేశంపై సైబర్ దాడి జరుగుతోంది

ఆస్ట్రేలియా ప్రభుత్వ సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నట్లుగా ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ఆ దేశ పరిశ్రమలను కూడా కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని అన్నారు.  అయితే కొన్ని ప్రభుత్వ విభాగాలను ఇప్పటికే దాడి చేశారని.. అయితే  తమ దేశానికి సంబంధించిన కీలక డేటా మాత్రం సురక్షితంగా ఉందని ప్రకటించారు. ఇక తాము సెక్యూరిటీ నిబంధనలను పాటించినా సైబర్ దాడులు జరుగుతున్నాయని అన్నారు.  ఈ సైబర్ దాడుల వెనుక ఓ […]

మా దేశంపై సైబర్ దాడి జరుగుతోంది
Follow us

|

Updated on: Jun 19, 2020 | 10:58 AM

ఆస్ట్రేలియా ప్రభుత్వ సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నట్లుగా ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ఆ దేశ పరిశ్రమలను కూడా కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని అన్నారు.  అయితే కొన్ని ప్రభుత్వ విభాగాలను ఇప్పటికే దాడి చేశారని.. అయితే  తమ దేశానికి సంబంధించిన కీలక డేటా మాత్రం సురక్షితంగా ఉందని ప్రకటించారు.

ఇక తాము సెక్యూరిటీ నిబంధనలను పాటించినా సైబర్ దాడులు జరుగుతున్నాయని అన్నారు.  ఈ సైబర్ దాడుల వెనుక ఓ దేశానికి చెందిన ప్రభుత్వం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దేశం పేరు చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. అయితే పరోక్షంగా  చైనాను మారిసన్ నిందించారు.