Biggest Telescope: విశ్వ రహస్యాలు చేధించేందుకు అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌.. సైటింస్టుల కీలక ముందడుగు..

|

Dec 06, 2022 | 9:59 AM

ఎన్ని సాధించిన అంతుచిక్కని రహస్యాలు ఉండనే ఉంటాయి విశ్వంలో. అలాంటి విశ్వంపై ఇంకా ఫోకస్‌ పెట్టడానికి రంగం సిద్దమైంది. విశ్వ రహస్యాలు చేధించేందుకు అతి

Biggest Telescope: విశ్వ రహస్యాలు చేధించేందుకు అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌.. సైటింస్టుల కీలక ముందడుగు..
Biggest Telescope
Follow us on

ఎన్ని సాధించిన అంతుచిక్కని రహస్యాలు ఉండనే ఉంటాయి విశ్వంలో. అలాంటి విశ్వంపై ఇంకా ఫోకస్‌ పెట్టడానికి రంగం సిద్దమైంది. విశ్వ రహస్యాలు చేధించేందుకు అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ నిర్మాణం చేపట్టారు సైటిస్టులు. 21వ శతాబ్దంలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకదాని నిర్మాణం ప్రారంభమైంది. ది స్క్వేర్‌ కిలోమీటర్‌ ఆర్రే పేరిట అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలుపెట్టారు. దీనిని 2028 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం యూకేలో ఉంటుంది. ఖగోళంలో చాలా మిస్టరీలపై పరిశోధనలకు దీనిని వినియోగించనున్నారు.

ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలపై కూడా పరిశోధనలు చేయనుంది. భూగోళం వంటి గ్రహాలు మరేమైనా ఉన్నాయేమో అన్న అంశంపై కూడా శోధించనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియాలోని మార్చిసన్‌ ప్రాంతంలో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రిస్మస్‌ చెట్లు వంటి దాదాపు లక్షకు పైగా యాంటెన్నాలను నిర్మించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా రేడియో, ఆప్టికల్‌ టెలిస్కోప్‌లు ఉన్నా.. దీంతో వాటిని పోల్చలేమన్నారు ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆంటోని. ఈ ప్రాజెక్టులో 16 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..