Artificial Womb: అమ్మగా మారుతున్న రోబో.. అన్ని తానై మీకు నచ్చినట్లుగా.. అదే పనిలో చైనా పరిశోధకులు..

|

Feb 02, 2022 | 2:56 PM

మీకు పుట్టబోయే బిడ్డ ఏం చదువు కోవాలి.. అతడిని డాక్టర్ చేయాలా..? యాక్టర్ చేయాలా..? ఇలా మీ ఇష్టమొచ్చినట్లుగా ముందే నిర్ణయించుకుని వారికి రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను తొమ్మిది నెలల పాటు మోసి కని

Artificial Womb: అమ్మగా మారుతున్న రోబో.. అన్ని తానై మీకు నచ్చినట్లుగా.. అదే పనిలో చైనా పరిశోధకులు..
Babies In Artificial Womb
Follow us on

Babies in Artificial Womb: భవిష్యత్తులో నవజాత శిశువులో పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం ప్రయోగశాలలో పూర్తవుతుంది. రోబో పిల్లలను నర్సులా చూసుకునే పని రాబోతోంది. ఈ పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమర్చిన రోబోట్లు వస్తున్నాయి. చైనా పరిశోధకులు తమ తాజా పరిశోధనలో ఇలా సాగుతున్నాయి. భవిష్యత్తులో, శిశువు మానవ గర్భం వెలుపల అభివృద్ధి చెందుతుందని వారు వెల్లడించారు. తల్లి కడుపులో 9 నెలలు గడిపిన పిండం నవజాత శిశువుగా రూపాంతరం చెందినట్లే .. ల్యాబ్‌లో తయారు చేసిన కృత్రిమ గర్భంలో బిడ్డ అభివృద్ధి చెందుతుంది. చైనాలోని సుజౌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కృత్రిమ గర్భంలో పెరిగిన శిశువును జాగ్రత్తగా చూసుకునే రోబోట్‌ను రూపొందించారు. బిడ్డకు పోషకాలను అందించడం నుంచి మొదలు.. ఆ శిశువు కదలికలను ఇది జాగ్రత్తగా కనిపెట్టి ఉంటుందని చైనా పరిశోధకులు వెల్లడించారు.  

ఇప్పటికే చైనాలో ప్రయోగాలు 

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ ప్రయోగం ప్రస్తుతం చైనాలో జరుగుతోంది. కానీ ఎలుకలపై.. AIతో కూడిన రోబోటిక్ బేబీ సిట్టర్ ఎలుకలను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగం ద్వారా మానవ పిండాల అభివృద్ధిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతామని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని సహాయంతో పుట్టుకకు సంబంధించిన సమస్యలను పరిశీలించవచ్చని అంటున్నారు.

అన్నింటినీ అదుపులో ఉంచుకోవాలి..

చైనీస్ శాస్త్రవేత్తల తన పరిశోధనల ఫలితాలను జర్నల్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో  చురించారు.  AI రోబోటిక్ మంత్రసాని, కృత్రిమ పిండాన్ని ప్రతిదీ నియంత్రణలో ఉండే విధంగా తయారు చేసినట్లు తాజా రిపోర్టులో వెల్లడించారు. పిండంలో పెరుగుతున్న పిల్లల శరీరంలో ఎంత మార్పు జరుగుతోందో అర్థమవుతుందని వారు అంటున్నారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ AI రోబోటిక్ మంత్రసాని శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తుందిని.. దీంతో వెంటనే చికిత్స అందించేందుకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. 

డిజైర్ బేబీ సిద్ధం..

ల్యాబ్‌లో బిడ్డ ఈ విధంగా అభివృద్ధి చెందితే.. వారి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు లేదా వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక వ్యక్తికి ఎలాంటి బిడ్డ కావాలో అతను స్వయంగా నిర్ణయించగలడు. అతని అవసరాన్ని బట్టి.. పిల్లవాడిని సిద్ధం చేయవచ్చు. అంటే, మీరు పిల్లలలోని బలాలను ముందే నిర్ణయించుకుని.. మీకు పుట్టబోయే బిడ్డ ఏం చదువు కోవాలి.. అతడిని డాక్టర్ చేయాలా..? యాక్టర్ చేయాలా..? ఇలా మీ ఇష్టమొచ్చినట్లుగా ముందే నిర్ణయించుకుని వారికి రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను తొమ్మిది నెలల పాటు మోసి కని.. మీ చేతిలో పెట్టేయవచ్చంటున్నారు చైనా పరిశోధకులు. అంతే కాదు పుట్టబోయే బిడ్డలో ఏమైనా లోపాలుంటే మందుగానే గుర్తించి వాటిని పిండంలో ఉన్నప్పుడే సవరించవచ్చు..

అయితే ఇటువంటి సాంకేతిక అభివృద్ధిని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిని అనైతికంగా పేర్కొంటున్నారు. రోబోటిక్ బేబీ సిట్టర్లు పిల్లలను ఎంత వరకు చూసుకుంటారో ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పడం మాత్రం కష్టం.

ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: వర్చువల్ ర్యాలీలతో దూసుకుపోతున్న ప్రధాని మోడీ.. వెనకబడిన ప్రధాన పార్టీలు..

Ramanujacharya Sahasrabdi: ఘనంగా శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోత్సవం.. ముచ్చింతల్‌లో ప్రారంభమైన వేడుకలు..